
అయితే ఈ వార్తలు పూర్తిగా నిజం కాదని తాజా సమాచారం. ముందుగా అనుకున్న ప్రకారం సరిలేరు నీకెవ్వరూ 11న వస్తే, 12న వచ్చే అల వైకుంఠపురంలో సినిమాకు 60% థియేటర్స్ ఇవ్వాలి. 13 నుండి ఇరువురు సమానంగా పంచుకోవాలి. అయితే ఈ నియమాన్ని దిల్ రాజు తప్పాడట. 12న అల వైకుంఠపురంలో సినిమాకు 40% థియేటర్స్ కు మించి ఇవ్వము అంటున్నారట.
దీనితో బన్నీకి కోపం వచ్చి 10నే వస్తాం అని లీకులు ఇప్పించాడట. అయితే సరిలేరు టీం ఏమీ తగ్గడం లేదు. ముందు అనుకున్నట్టు 12న వస్తే పర్లేదు… ముందుకు జరిగితే మాత్రమే అదే రోజున మేము కూడా వస్తాం అంటున్నారట. ఈ వివాదంపై ఈరోజు లేక రేపు క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
ఇది ఇలా ఉండగా ఈ రెండు సినిమాలపై దాదాపుగా 200 కోట్ల బిజినెస్ జరిగింది. రెండు సినిమాలపై భారీగా పెట్టుబడులు పెట్టిన బయర్లు ఏం జరుగుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సరైన రిలీజ్ డేట్ పడకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.
Kajal Aggarwal had earlier said that she was playing a small role in Ramayana, but…
A car accident involving Meghana, daughter-in-law of former YSRCP minister Jogi Ramesh, has raised concerns…