
ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ క్రమంలో సినిమా విడుదలకు ముందు మరో రెండు ఈవెంట్లు చెయ్యదలిచారు. ఈ నెల 28న మ్యూజికల్ నైట్ పేరిట ఒక ఈవెంట్ హైదరాబాద్ లో, వచ్చే నెల 5న ప్రీ-రిలీజ్ ఈవెంట్ విశాఖపట్నంలో జరపడానికి నిర్ణయించారట.
ఈ రెండు ఈవెంట్లలో ఒక దానికి మెగాస్టార్ చిరంజీవి, ఒక దానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను చీఫ్ గెస్ట్ గా తీసుకుని రావాలని నిర్మాతలు ప్రయత్నిస్తున్నారట. వీటికి సంబంధించిన అధికారిక ప్రకటన తొందరలో వెలువడుతుంది. ఇది ఇలా ఉండగా బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన జులాయి, సన్ అఫ్ సత్యమూర్తి భారీ హిట్లు కావడంతో ఈ సినిమా మీద అంచనాలు బాగా పెరిగాయి.
హీరో సుశాంత్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. చాలా ఏళ్ల తరువాత టబూ ఈ సినిమాతో మళ్ళీ తెలుగు సినిమాలలోకి తిరిగి వచ్చింది. చిత్రంలో ఒక కీలక పాత్రలో ఆమె చెయ్యబోతుందని సమాచారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ పతాకాలపై ఎస్. రాధాకృష్ణ, అల్లు అరవింద్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బన్నీ గత సినిమా నా పేరు సూర్య ప్లాప్ కావడంతో ఈ సినిమా మీద భారీ ఆశలే పెట్టుకున్నాడు.
After making his directorial debut with Oke Oka Jeevitham, Shree Karthick is preparing for his…
The Rajinikanth - Kamal Haasan multistarrer directed by Nelson is back in the news. This…