
అల్లు అర్జున్ ని హైలైట్ చెయ్యడంతో పాటు చిత్రంలో ఉన్న మిగతా నటీనటులను కూడా త్రివిక్రమ్ టీజర్ లో పరిచయం చేశారు. అయితే కొంత మేర అత్తరింటికి దారేది సినిమా ఫీల్ రాకమానదు. ఇది ఇలా ఉండగా చిత్రం షూటింగ్ ముగింపుకు చేరుకుంది. చివరి షెడ్యూల్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది.
బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన జులాయి, సన్ అఫ్ సత్యమూర్తి భారీ హిట్లు కావడంతో ఈ సినిమా మీద అంచనాలు బాగా పెరిగాయి. ఈ సినిమాలో హీరో సుశాంత్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. చాలా ఏళ్ల తరువాత టబూ ఈ సినిమాతో మళ్ళీ తెలుగు సినిమాలలోకి తిరిగి వచ్చింది. చిత్రంలో ఒక కీలక పాత్రలో ఆమె చెయ్యబోతుందని సమాచారం.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ పతాకాలపై ఎస్. రాధాకృష్ణ, అల్లు అరవింద్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బన్నీ గత సినిమా నా పేరు సూర్య ప్లాప్ కావడంతో ఈ సినిమా మీద భారీ ఆశలే పెట్టుకున్నాడు. జనవరి 12న సంక్రాంతి సందర్భంగా సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది.
Rohith Nara has always been recognized for his penchant for unique scripts and diverse character…
దక్షిణ భారతంలో భాగమైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాజకీయాలు అన్ని కూడా ఒకే నావలో పయనించే ప్రయాణికుల మాదిరి కనిపిస్తున్నాయి.…