
గత 10 ఏళ్ల నుంచి శాస్త్రవేత్తలకు అంతుచిక్కని రహస్య శక్తివంతమైన సంకేతాలు ఫాస్ట్ రేడియో బరస్ట్ (ఎఫ్‌ఆర్‌బీ) లను పంపుతున్నారని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు వెల్లడించారు. గ్రహాంతరవాసుల ఉనికిని కనుగొనడమే లక్ష్యంగా వారు ఈ శక్తివంతమైన తరంగాలను పంపుతున్నారని తెలిపారు. అంతే కాకుండా ఆస్ట్రేలియాలోని మోలోగ్లో రేడియో టెలిస్కోప్ ద్వారా 2013లో మూడు ఎఫ్‌ఆర్బీలను గుర్తించామని, ఆ తరంగాల సమాచారాన్ని విశ్లేషించగా అవి అంతరిక్షానికి అత్యంత దూరం నుంచి, వేరే గెలాక్సీ నుంచి వస్తున్నాయని తేలిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
ఈ తరంగాలను పంపించేది బహుశా గ్రహాంతర వాసులే కావచ్చునని మెల్ బోర్న్ లోని స్విన్ బర్న్ యూనివర్సిటీ అఫ్ టెక్సాలజీ శాస్త్రవేత్త మాథ్యూ బేయిల్స్ తెలిపారు. అయితే ఇన్నాళ్లూ ఆ తరంగాలను మానవులే పంపిస్తున్నారని భావించామని, అయితే అది తప్పని గుర్తించామని, ఈ తరంగాలను కనుగొనడంతో పాటు విశ్లేషించడం కూడా చాలా కష్టమని అభిప్రాయపడ్డారు. దీంతో ఈ సువిశాల విశ్వాంతరాళంలో మనిషి ఒంటరి వాడు కాదని, మనిషితో పాటు మరికొన్ని గ్రహాలపై కూడా జీవం ఉందని వారు పేర్కొంటున్నారు.
Kamal Haasan is a renowned legend of Indian Cinema and he has been choosing young…
Kayadu Lohar has explained why she wrote “I look like a potato” after sharing her…