
తెలుగు సినిమా పరిశ్రమ ఈ మధ్య చాలా నీరసంగా కనిపిస్తోంది. గత కొన్ని వారాలుగా థియేటర్లలో సరైన హిట్ సినిమా లేక, ప్రేక్షకులు ఇంటికే పరిమితమయ్యారు. ఈ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ, నాచురల్ స్టార్ నాని తన కొత్త చిత్రం HIT: The Third Case తో మే 1, 2025న థియేటర్లలోకి రాబోతున్నాడు. ఈ సినిమా తెలుగు సినిమా పరిశ్రమకు కావాల్సిన ఊపు తీసుకొస్తుందా? జనాలను మళ్లీ థియేటర్ల వైపు పరుగులు తీయించగలదా అనేది చూడాలి.
2025లో తెలుగు సినిమా పరిశ్రమలో కొన్ని సినిమాలు బాక్సాఫీస్‌ను షేక్ చేయగా, చాలావరకు నిరాశపరిచాయి. ఇప్పుడు తెలుగు సినిమాకు ఒక బ్రేక్ కావాలి! గత కొన్ని నెలలుగా తెలుగు సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా సందడి కనిపించలేదు. కొత్త సినిమాలు వచ్చినా, అవి ప్రేక్షకులను ఆకర్షించడంలో విఫలమవుతున్నాయి. వెంకటేష్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’, 300 కోట్లకు పైగా సాధించి వెంకటేష్ కెరీర్ లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ కూడా హిట్ టాక్ తెచ్చుకొని మంచి కలెక్షన్స్ సాధించింది. అదే టైములో రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ భారీ అంచనాలతో విడుదలై, డిసాస్టర్ గా నిలిచింది. ఫిబ్రవరిలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ‘తండేల్’, ₹100 కోట్లకు పైగా వసూళ్లతో స్మాల్ హిట్‌గా నమోదైంది. తక్కువ బడ్జెట్ తో కోర్ట్ డ్రామాగా తెరకెక్కిన ‘కోర్ట్’ సినిమా కూడా మంచి సక్సెస్ ని అందుకుంది. MAD-2 కూడా పర్వాలేదనిపించింది. విశ్వక్ సేన్ నటించిన ‘లైలా’, సిద్ధు జొన్నలగడ్డ నటించిన ‘జాక్’, సందీప్ కిషన్ ‘మజాకా’, నితిన్ ‘రాబిన్ హుడ్’, తమన్నా ‘ఓదెల 2’, కనీసం ఓపెనింగ్స్ లేక థియేటర్లు వెలవెలబోయాయి. ఈ నెలలో రిలీజ్ అయినా కళ్యాణ్ రామ్ ‘అర్జున్ S/o వైజయంతి’ మంచి ఓపెనింగ్స్ సాధించినా, ఆదివారం నాడు పెద్ద జంప్ లేక సగటు వసూళ్లతో కొనసాగుతుంది.
ఈ సమయంలో, నాని నటించిన HIT-3 ట్రైలర్ విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో హైప్ ఊపందుకుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-రిలీజ్ బిజినెస్ కూడా ఓవర్సీస్‌లో బ్లాక్‌బస్టర్ స్థాయిలో జరిగిందని టాక్. HIT సిరీస్ గతంలో సస్పెన్స్ థ్రిల్లర్ జానర్‌లో మంచి మార్క్ వేసింది. గతంలో వచ్చిన HIT: The First Case మరియు HIT: The Second Caseతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు HIT: The Third Caseలో నాని అర్జున్ సర్కార్ అనే క్రూరమైన పోలీసు అధికారి పాత్రలో కనిపించబోతున్నాడు. ట్రైలర్‌లో చూపించిన హై-ఇంటెన్సిటీ యాక్షన్ సీన్స్, నాని యొక్క రగ్గడ్ లుక్, “అబ్ కీ బార్ అర్జున్ సర్కార్” అనే డైలాగ్ ప్రేక్షకులలో హైప్ ను పెంచాయి. ఈ సినిమా నాని రెగ్యులర్ ఫామిలీ ఇమేజ్ ను పక్కనపెట్టి, హార్డ్-హిట్టింగ్ యాక్షన్ హీరోగా తెరకెక్కింది. నాని తన సినిమాల ఎంపికలో చూపించే ధైర్యం కూడా అతన్ని ప్రత్యేకంగా నిలబెడుతుంది. కమర్షియల్ మసాలా సినిమాలతో పాటు, శ్యామ్ సింగ రాయ్, హాయ్ నాన్న లాంటి కంటెంట్ డ్రివెన్ సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నాడు. ఇప్పుడు HIT-3తో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. సోషల్ మీడియాలో టీజర్ 24 గంటల్లో 12 మిలియన్ వ్యూస్ సాధించి, టైర్-2 హీరోల రికార్డులను బద్దలు కొట్టింది. అయితే, అసలు ప్రశ్న ఇదే – ఈ హైప్ థియేటర్ టికెట్ల రూపంలో మారుతుందా?
తెలుగు ప్రేక్షకులు ఈ మధ్య కాలంలో కంటెంట్‌ను బాగా ఆదరిస్తున్నారు. నాని ఒక హీరోగా, నిర్మాతగా తెలుగు సినిమాలో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్నాడు. ఇపుడు హీరోగా, ప్రొడ్యూసర్ గా HIT-3తో మరోసారి సత్తా చాటడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ సినిమా కేవలం నానికి మాత్రమే కాదు, తెలుగు సినిమా పరిశ్రమకు కావాల్సిన ఒక బూస్టర్ షాట్ కూడా. మే 1 నుంచి థియేటర్లలో HIT-3 సందడి మొదలవుతుంది.
Tollywood’s December release race is getting more interesting, with Nithiin’s Alias Rukmini joining the December…
Vijay’s son Jason Sanjay chose to make his entry into films as a director rather…