
ఒక యాక్టర్ చనిపోయారు. వాళ్ల ఇంటికి వెళ్లాను. అక్కడ ఆయన డెడ్ బాడీ ఉంది.. అందరూ ఎమోషనల్ గా ఉన్నారు. ఈ లోగా, ఒకాయన వచ్చి నా భుజం తట్టి, సార్… ఒక సెల్ఫీ అన్నాడు. నాకేమో కోపమొస్తోంది… ఇప్పుడొద్దులే అని చెప్పాను. ‘ప్లీజ్ సార్… ఒక్క సెల్ఫీ’ అని అతను అన్నాడు. మళ్లీ వద్దని చెప్పాను. అయినా, సెల్ఫీ అంటూ విసిగించాడు. సరే, అని అతని పక్కనే నిలబడ్డాను. ‘సార్, నవ్వండి సార్’ అని అతను అనడంతో నాకు కొట్టేదామన్నంత కోపమొచ్చింది… కానీ, కొట్టలేదు. మా నాన్న చనిపోయినప్పుడు కూడా చాలా మంది వచ్చి ఇదే విధంగా చేశారు. అక్కడికి వచ్చిన సెలబ్రిటీలను వీడియో తీయడం చేశారు” అంటూ ‘అల్లరి’ నరేష్ చెప్పుకొచ్చాడు.
అసలు సెల్ఫీలంటే తనకు ఇష్టముండదని, ఫ్యాన్స్ వచ్చి అడిగితే సెల్ఫీకి సరే అంటాను తప్ప, తనంతట తానుగా సెల్ఫీలు దిగనని చెప్పాడు. సామాజిక మాధ్యమాల్లో కూడా తన సెల్ఫీ పోస్టింగ్ లు కూడా ఎక్కువగా పెట్టనని చెప్పాడు. సెల్ఫీ దిగడం అంటే ఏదోగా అనిపిస్తుందన్నాడు. ‘మా ఫ్రెండ్స్ అందరిలోకి నేనే ఎక్కువ ఎత్తుగా ఉంటాను. ఒరేయ్, నీ చేతులు పొడుగ్గా ఉంటాయిరా, నువ్వే తీయరా సెల్ఫీ అని నా ఫ్రెండ్స్ అంటుంటారు. సెల్ఫీ స్టిక్ అనుకున్నారా లేక చేతులనుకున్నారా? అని నేనంటూ ఉంటాను’ అని నరేష్ చెప్పాడు. ఈ అల్లరోడు నటించిన తాజా చిత్రం ‘సెల్ఫీ రాజా’ సినిమా విడుదల ప్రమోషన్ లో భాగంగా సదరు సంగతులన్నీ చెప్పుకొచ్చారు.
Irumudi has completely changed Ravi Teja’s career equation. After a long run of bad films,…
కొండా సురేఖ మంత్రి పదవి బర్తరఫ్ తరువాత కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. నిన్న మొన్నటి వరకు…