
తాను చేయని నేరానికి అనేక దశాబ్దాలు జైలు జీవితం గడిపి, పోలీసుల అదుపులో ఉన్నప్పుడు పోలీసులటార్చర్ కు గురైన వ్యక్తి యొక్క నిజమైన కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడిందని ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు వెల్లడించాడు. అల్లరి నరేష్ నగ్నంగా మారడానికి మొదట్లో అనుమానంగా ఉన్నా చేస్తున్న పాత్రకు న్యాయం చెయ్యాలని సాహసం చేశాడట.
ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తయింది, పోస్ట్ ప్రొడక్షన్ పనులు చురుకైన వేగంతో జరుగుతున్నాయి. అయితే కరోనా కారణంగా సినిమా విడుదలపై సందిగ్దత నెలకొంది. దర్శకుడు సతీష్ వేగేశ్న ఈ ప్రాజెక్ట్ కోసం నిర్మాతగా మారుతున్నారు . ఇది అతని ఎస్వీ2 ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో పై నిర్మించబడుతుంది.
ఈ సినిమాకు ఆయన దాదాపుగా ఎనిమిది కోట్లు ఖర్చుపెట్టారట. నరేష్ కు ఉన్న మార్కెటు కు ఇది చాలా ఎక్కువ. ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రంతో పాటు అల్లరి నరేష్ మరో సినిమా ‘బంగారు బుల్లుడు’ కూడా షూటింగ్ పూర్తి చేసుకుంది. కరోనా కారణంగా విడుదలపై క్లారిటీ లేకుండా పోయింది.
Ranbir Kapoor has apologised for his speech mistake at a Dussehra event in Kolkata. The…
After Little Hearts, Mouli connected strongly with the audience. However, the success also brought something…