ఏడాదికి 150 కోట్ల చిల్లు… మాకు సంబంధం లేదంటున్న అల్లు అరవింద్

టాలీవుడ్ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ కావడం, ఆ తరువాత ఒక ‘వార్నింగ్’ లాంటి ప్రెస్ నోట్ రావడంతో అసలు సమస్యల గురించి మానేసి అంతా ఇప్పుడు పవన్ కళ్యాణ్, హరి హర వీరమల్లు మీద పడ్డారు.

ADVERTISEMENT

‘ఆ నలుగురు’ లో తాను లేను అంటూ అల్లు అరవింద్ కూడా మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా M9 News ప్రతినిధి అడిగిన ఒక ప్రశ్న ఇప్పుడు ట్రేడ్ వర్గాలలో డిస్కషన్ అవుతుంది.

“థియేటర్లకు ఇప్పుడు అన్నిటికంటే పెద్ద సమస్య VPF ఛార్జీలు… QUBE లో మీరు, UFO లో సురేష్ బాబు పార్టనర్స్ అని… మీరే ముక్కుపిండి VPF వసూలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి,” అని ప్రశ్న.

అయితే ఇందుకు అల్లు అరవింద్ తెలివిగా సమాధానం చెప్పారు. తాను QUBE లో పార్టనర్ కాదని, సురేష్ బాబుకు UFO కు కూడా సంబంధం లేదని చెప్పారు.

నిజమే వారిద్దరూ పార్టనర్స్ కాదు. రెండు తెలుగు రాష్ట్రాలకు లైసెన్స్ హోల్డర్స్.

ప్రెస్ మీట్ తరువాత ఆఫ్ ది రికార్డు M9 News ప్రతినిధి లైసెన్స్ హోల్డర్ గా అయినా బాధ్యత తీసుకుని మీరు ఈ రేట్లు తగ్గించాలి కదా అంటే.

“అది మీరు ఓనర్స్ ను అడగాలి. వాళ్ళ నంబర్లు మీకు ఇస్తా,” అని సమాధానం చెప్పారు అరవింద్.

అప్పుడెప్పుడో మగధీర టైంలో డిజిటల్ ప్రింట్లు వచ్చాయి. డిజిటల్ కు మారితేనే మగధీర సినిమా, అలాగే ప్రింట్ అయితే 60,000-70,000 ఖర్చు అవుతుంది. డిజిటల్ అయితే తక్కువకు అయిపోతుందని థియేటర్లకు డిజిటల్ ప్రాజెక్టులను అంటగట్టారు.

వన్-టైం ఛార్జ్ కాకుండా ప్రొజెక్టర్ రెంట్ తీసుకోవడం మొదలుపెట్టారు. అలాగే VPF కింద డిస్ట్రిబ్యూటర్ నుండి వారానికి 10,000 నుండి 13,500 తీసుకుంటున్నారు. కొన్ని సీ సెంటర్స్ అయితే ఆ మేరకు కూడా కలెక్షన్స్ లేకపోవడంతో వారికి సినిమా ఇవ్వడమే మానేశారు. దానితో ఎన్నో థియేటర్లు మూతపడ్డాయి.

ప్రింట్ కు 60,000-70,000 అయినా అదే ప్రింట్ ను అనేక థియేటర్లకు తిప్పే వారు. ఒక బంచ్ అఫ్ థియేటర్స్ అయ్యాకా ఇంకో బంచ్ కు ఇచ్చి 1000 రోజుల వరకు తిప్పేవారు. ఇదే 60,000-70,000 రూపాయిలలో.

అయితే డిజిటల్ వచ్చాకా అదీ ఇదీ అని ఒక్కో థియేటర్ నుండే లక్ష రూపాయిలు నెలకు వసూల్ చేస్తున్నారు. పైగా ప్రతీ షోకు ఇంటర్వెల్ లో వేసే యాడ్స్ రెవిన్యూ కూడా ఆ కంపెనీలవే. అంటే యాడ్స్ లేకుండా అక్షరాలా థియేటర్ల నుండి పిండుతుంది 150 కోట్లు.

ఇక మల్టీప్లెక్స్ ల ది ఇంకో కథ. సొంత ప్రొజెక్టర్లు ఉన్నా VPF వసూలు చేస్తారు కార్పొరేట్ పోషణ పథకం.

సరే సింగల్ స్క్రీన్స్ లో ప్రొజెక్టర్ పెట్టారు… కానీ ఎంతో కొంత టైం కు సన్ సెట్ పీరియడ్ ఉండాలి కదా? ఆ పేరు మీద ఈ పేరు మీద అది ఎప్పటికీ అవ్వదు.

ఇంగ్లీష్ సినిమాలకు, YRF, ధర్మా లాంటి పెద్ద సంస్థలు చేసే సినిమాలకుడిస్ట్రిబ్యూటర్లు VPF కట్టరు. ఆ సంస్థలే తక్కువకు అగ్రిమెంట్ చేసుకుని డైరెక్ట్ గా డిజిటల్ కంపెనీలకు డబ్బులు కడతాయి. తెలుగు సినిమాలకు మాత్రం ముక్కుపిండి VPF వసూలు చేస్తారు.

రెండు తెలుగు రాష్ట్రాలలో 70% థియేటర్లలో QUBE, 30% థియేటర్లలో UFO ఉన్నాయి. మధ్యలో చిన్నా చితకా కంపెనీలు వచ్చాయి. వాటిని Acquire చేసెయ్యడమో లేక ఆ ప్రొజెక్టర్లు పెట్టుకున్న థియేటర్లకు సినిమాలు ఇవ్వము అనో బెదిరించి వాటిని ఇక్కడ ఎదగనివ్వరు.

వాళ్లకు సినిమాలు ఇస్తే పైరసీ వచ్చేస్తదని వంక. అయితే ఇప్పుడు పైరసీ వస్తుంది కదా? ఆ బాధ్యత QUBE,UFO లది అనుకోవచ్చా?

ఇప్పుడు కొత్తగా TSR అనే డిజిటల్ కంపెనీ వచ్చింది. ఆ కంపెనీ నెలకు 10,000+ GST మాత్రమే వసూల్ చేస్తుంది. అయితే అటువంటి డిజిటల్ ప్రొజెక్టర్ పెట్టుకుంటే ఎన్నో ఇబ్బందులు. రేట్లు ఎక్కువైనా ఈ రెండు కంపెనీలదే రాజ్యం.

అల్లు అరవింద్ చెప్పినట్టు తాము కేవలం లైసెన్స్ హోల్డర్స్ మేము రేట్లు నిర్ణయించలేం అంటే అది చాలా బాధాకరం

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Comrade Kalyan Review: Outdated Comedy, Comrade

BOTTOM LINE Outdated Comedy, Comrade RATING 1.75/5 Story, Screenplay,Director: Janakiram Marella Cast: Sree Vishnu, Mahima…

8 minutes ago

Eyes Review: Novel Thriller, Slightly Overstuffed

BOTTOM LINE Novel Thriller, Slightly Overstuffed PLATFORM SonyLIV RUNTIME 6 Hours [7 Episodes] What Is…

24 minutes ago