
తాజాగా ఏప్రిల్ లో ఆ సినిమా మొదలు అవుతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. నిర్మాతలు ఇప్పటిదాకా ఆ విషయాన్నీ ధృవీకరించలేదు. ఒకవేళ అదే జరిగితే నా పేరు సూర్య విడుదలైన ఒక సంవత్సరానికి గానీ తరువాతి సినిమా మొదలు కాదు. అసలు ఆ సినిమా గురించి ఎటువంటి ప్రకటన చెయ్యకుండా ఇప్పుడు ఎప్పుడో జరగబోయే 20వ సినిమా గురించి హడావిడి ఏంటని అభిమానులు అంటున్నారు. ఇప్పటికైనా ఆ సినిమా గురించి అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి.
నా పేరు సూర్య చిత్రం అట్టర్ ప్లాప్ ఐన విషయం అందరికీ తెలిసిందే. వరుస విజయాలతో బన్నీ సినిమా అంటే మినిమం గారంటీ అనుకునే తరుణంలో వచ్చిన ఈ పరాజయంతో షాక్ తిన్న బన్నీ జాగ్రత్త పడటం మొదలు పెట్టారు. తన తరువాతి సినిమాలను ఎంచుకోవడంలో జాగ్రత్త పడుతున్నాడు. ఈ జాగ్రత్త వల్లే సినిమాలు ఆలస్యం అవుతున్నాయి అని ఆయా వర్గాలు అంటున్నాయి. ఈ రెండు సినిమాలతో రెండు పెద్ద హిట్లు కొట్టాలని బన్నీ కృత నిశ్చయంతో ఉన్నాడట.
Sanjay Leela Bhansali recently confirmed the release date of Love & War, bringing relief to…
A student on an F-1 visa secured an internship with Amazon, but the opportunity soon…