Telugu

ఇదేంటి బన్నీ ఇలా అనేశాడు !

త్వరలో రాబోతున్న బడా సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. అందులో ‘పుష్ప’ ఒకటి. బన్నీ -సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా అవ్వడంతో ఈ ప్రాజెక్ట్ పై అందరిలో ఆసక్తి నెలకొంది.

‘రంగస్థలం’ తర్వాత సుకుమార్ ‘అల వైకుంఠ పురములో’ తర్వాత బన్నీ నుండి వస్తున్న సినిమా కావడంతో ట్రేడ్ పరంగానూ మంచి అంచనాలున్నాయి. ఇప్పటికే పలుమార్లు ‘పుష్ప’లో డైలాగ్ చెప్తూ సినిమాపై తను ఎంత కాన్ఫిడెన్స్ గా ఉన్నాడో చెప్పిన బన్నీ ఇప్పుడు పుష్ప గురించి ఏం చెప్పలేకపోయాడనే కామెంట్స్ వినబడుతున్నాయి.

ADVERTISEMENT

‘వరుడు కావలెను’ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన బన్నీ ఇదే ఏడాది చివర్లో మా పుష్ప రాబోతుంది. సినిమా గురించి ఇప్పుడే ఏం చెప్పలేను. చాలా ఎఫర్ట్ పెట్టాం.. మీ అందరికీ నచ్చాలని కోరుకుంటున్నా అన్నాడు. “పాటలు మాత్రం బాగుంటాయి”. ” రాబోయే సాంగ్స్ కూడా బాగుంటాయి.” అది మాత్రం చెప్పగలను అనడంతో ఎంటీ ఫ్యాన్స్ సినిమాపై బన్నీ కి కాన్ఫిడెన్స్ లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. బన్నీ మాములుగానే అన్నప్పటికీ’ సినిమా ఎలా ఉంటుందో తెలియదు పాటలు మాత్రం బాగుంటాయి’ అనే సెన్స్ లో మీనింగ్ ఉందని అంటున్నారు.

బన్నీ చెప్పిన విషయాన్ని బట్టీ చూస్తే తనకి సినిమాపై నమ్మకం లేదా..? అనే డౌట్స్ కూడా మొదలవుతున్నాయి. ఒకవేళ రిలీజ్ కి ముందు సినిమా గురించి గట్టిగా చెప్దామనుకుని ఇలా సైలెంట్ గా స్కిప్ కొట్టాడా ? ఏదేమైనా పుష్ప గురించి మాట్లాడిన అల్లు అర్జున్ స్పీచ్ మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

Share
Jhansi

Jhansi is a senior writer with extensive experience covering Telugu movies and the broader Indian cinema landscape. With a keen focus on U.S. updates related to Telugu people and Indians, as well as immigration & …

Published by

Recent Posts

I’ll Watch Sigma in Theatres – SS Rajamouli

Sigma starring Sandeep Kishan and Faria Abdullah is directed by Jason Sanjay, son of TN…

2 hours ago

Arjun May Not Speak, But His Love Will Be Seen

Itllu Arjuna starring Aniesh and Anaswara Rajan drew attention in the industry with the New…

2 hours ago