
అన్నింటికి బన్నీ స్పందిస్తున్నాడు. ఉదయాన్నే చిరంజీవి ట్వీట్ పెట్టేశారు. జూనియర్ ఎన్టీఆర్ పార్టీ లేదా పుష్ప అంటూ సరదాగా టీజ్ చేశాడు. రామ్ చరణ్ కొంత ఆలస్యంగా అయినా చిన్న లైన్ తో తనవైపు నుంచి గ్రీటింగ్స్ పంపించాడు. గత నెల చరణ్ కు అల్లు అర్జున్ శుభాకాంక్షలు చెప్పలేదన్నది మెగా ఫ్యాన్స్ చేస్తున్న ఫిర్యాదు. ఐకాన్ స్టార్ ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పుడు కూడా ట్విట్టర్ లో ఇదే రచ్చ ఇదే పంచాయితీ. దాని మీద ఆ రోజే చిన్నపాటి రాద్ధాంతం చేసుకున్నారు. పరస్పరం స్పందించే విషయంలో జాప్యం జరిగిన మాట వాస్తవమే.
మెగా అల్లు కుటుంబాల మధ్య ఏదో విభేదాలు ఉన్నందువల్లే ఇలా మొక్కుబడి సందేశాలు చెప్పుకుంటున్నారని ప్రచారం చేస్తున్న వాళ్ళకు కొదవ లేదు. నిజంగా వాళ్ళ మధ్య ఏముందో ఎవరికీ తెలియదు. పలు సందర్భాల్లో అల్లు అరవింద్ అలాంటిదేమి లేదని చెబుతూనే వచ్చారు. చిరంజీవి ఇంట్లో జరిగే వేడుకలకు రెండు ఫ్యామిలీలు హాజరైనా గత కొంతకాలంగా అల్లు అర్జున్ మిస్ కావడం ఈ గాసిప్పులకు మరింత బలం చేకూర్చింది. పెద్దలు ఎన్ని వివరణలు ఇచ్చుకున్నా ఫ్యాన్స్ వీటిని ఆపే మూడ్ లో లేరు.
ఇది క్రమంగా ఒక అలవాటుగా మారిపోయి రాబోయే తరాల సినిమా అభిమానుల మీద ప్రభావం చూపించబోతోంది. ఇప్పటికే రీ రిలీజుల కలెక్షన్ల మీద ఓ రేంజ్ లో కొట్టేసుకుంటున్న ఫ్యాన్స్ ఇప్పుడు గొడవలు పడేందుకు సందర్భాలను వెతికి మరీ మొదలుపెడుతున్నారు. టాలీవుడ్ లో మల్టీస్టారర్ లు ఎందుకు క్రమం తప్పకుండా ఎందుకు రావో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అభిమానం ఎంత ఉన్నా అది సినిమాల వరకే పరిమితం కావాలి కానీ ఇలా ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెద్దదిగా చూసుకుంటూ పోతే టైం వేస్ట్ తప్ప పైసా ప్రయోజనం ఉండదు.
Rajinikanth's Jailer 2 is maintaining strong momentum at the box office on its second day,…
Shah Rukh Khan’s fans have been eagerly waiting for an update on his next film,…