Telugu

‘గమ్యం’ సరైనదే అయినా ‘మార్గం’ ముళ్ళకంప అయితే..!

‘చెప్పను బ్రదర్’పై స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇచ్చుకున్న వివరణపై విజ్ఞుల నుండి ప్రశంసలు వ్యక్తమయ్యాయి. అలాగే ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ నుండి పెద్ద ఎత్తున మద్దతు లభించడం గమనించదగ్గ అంశం. బన్నీ చెప్పిన ప్రతి అక్షరం ఏదొక సందర్భంలో ఫీల్ అయిన విషయమే కావడంతో… సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ‘ఒక మనసు’ ఆడియో వేడుకపై బన్నీ చెప్పాలనుకున్న స్పష్టమైన అంశాలను… ముందుగా ‘చెప్పను బ్రదర్’ అంటూ వ్యాఖ్యానించి ఎందుకు అంత జటిలం చేసుకున్నారు? అన్న ప్రశ్న తలెత్తుతోంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు హితబోధ చేయాలనుకున్న బన్నీ ‘గమ్యం’ సరైనదే. అయితే తను ఎంచుకున్న ‘మార్గం’ మాత్రం సరైనది కాకపోవడంతోనే… వివాదం చెలరేగింది. బహుశా ‘సరైనోడు’ సక్సెస్ వేదికపై సంయమనం పాటించి ఉంటే బన్నీకి ఇంత ‘సంజాయిషీ’ చెప్పుకోవాల్సిన అవసరం వచ్చేది కాదేమో! పవన్ గురించి ప్రస్తావించను అని చాలా రకాలుగా చెప్పవచ్చు… అయితే ఫ్యాన్స్ ముఖం మీద కొట్టినట్టు ‘చెప్పను’ అని చెప్తే అభిమానులు తట్టుకోలేరు.

ADVERTISEMENT

బహుశా బన్నీ ఎంచుకున్న మార్గం… ముళ్ళును ముళ్ళుతోనే తీయాలని భావించుకుని ఉండవచ్చు. ఆడియో వేడుకలపై పవన్ ఫ్యాన్స్ చేస్తున్న గోలతో తామెంతగా మదనపడ్డామో, ఫ్యాన్స్ కూడా అలాంటి అనుభూతులనే చవిచూడాలనే ఉద్దేశంతో ‘చెప్పను బ్రదర్’ అంటూ ఫ్యాన్స్ కు కాస్త ఆగ్రహం తెప్పించేలా వ్యాఖ్యానించానని స్వయంగా బన్నీనే చెప్పుకొచ్చారు. అయితే అభిమానులు కూడా అదే ‘ముళ్ళు’ సిద్ధాంతాన్ని అనుసరిస్తే.., చివరికి కెరీర్ పరంగా నష్టపోయేది బన్నీ మాత్రమే.

ఒక స్థాయిలో ఉన్న వారు కాస్త ఆచితూచి వ్యాఖ్యానిస్తే… ఎప్పుడూ ఎలాంటి వివాదాలు తలెత్తవు. బన్నీ కెరీర్ ను పరిశీలిస్తే… ‘చెప్పను బ్రదర్’ ఉదంతం మినహాయిస్తే… వివాదాలకు దూరంగానే ఉన్నాడు. కానీ, ఒక్కసారిగా అభిమానులతో అయిన రచ్చ రీత్యా, అంతిమంగా వారికే సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. అయితే ధైర్యంగా తన అభిప్రాయాలను వ్యక్తపరిచినందుకు, అలాగే బన్నీ చెప్పిన విధానానికి అభిమానులు కూడా సంతృప్తి వ్యక్తం చేయడం ఆహ్వానించదగ్గ పరిణామం. దీంతో రాబోయే రోజుల్లో ఆడియో వేడుకలు కాస్త ఆహ్లాదకరంగా ఉంటాయేమో చూడాలి.

Share
Siddartha Toleti

With over a decade of experience as a movie reviewer, Siddhartha (pen name) brings in-depth analysis and insights to every review. Passionate about films and TV series across all languages, Siddhartha primarily focuse…

Published by

Recent Posts

Soori-Suhas Film Suddenly Becomes Crucial for Suriya?

Following the commercial success of Karuppu and Vishwanath and Sons, Suriya is currently starring as…

25 minutes ago

Announced Dates. Now Comes the Back-Off!

Tollywood’s release calendar is getting a little messy. As per the buzz, around four films…

55 minutes ago