Telugu

అమరావతిపై విషం కక్కుతున్నందుకే ఓటమి.. అయినా మారేదేలే!

ఆంధ్రాలో నేడు విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఓ పక్క ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్ జరుగుతోంది. ఎప్పటిలాగే కడప జిల్లాలో ప్రధానంగా.. పులివెందుల నియోజకవర్గం పరిధిలో అల్లర్లు జరుగుతున్నాయి. ఆర్‌.తుమ్మలపల్లి, పార్నపల్లె, ఎర్రిపల్లి, గుండ్లకుంటలో ఘర్షణలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

రాష్ట్రంలో మిగిలిన జిల్లాల్లో పోలింగ్ చాలా ప్రశాంతంగా సాగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ కట్టారు. తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.

ADVERTISEMENT

మరోపక్క మురుసు తుఫాను ప్రభావంతో పలు జిల్లాల్లో అనేక గ్రామాలలోకి మోకాలి లోతు నీళ్ళు చేరాయి. వేల ఎకరాలు నీట మునిగాయి.

సిఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల హడావుడిని పక్కన పెట్టి హుటాహుటిన హెలికాఫ్టర్‌లో ముంపు ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం ప్రధాని మోడీతో మాట్లాడి పరిస్థితి వివరించి తక్షణం సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.

ఎప్పటిలాగే మళ్ళీ అమరావతి మునిగి పోయిందంటూ వైసీపీ మద్దతుదారులు, వారి అనుకూల మీడియా, సోషల్ మీడియాలో నకిలీ ఫోతోలతో దుష్ప్రచారం మొదలుపెట్టేశారు.

కనుక సీఎం చంద్రబాబు నాయుడు ఒకేసారి ఇన్ని పనులు చక్కబెట్టాల్సివస్తోంది. వీటిలో ఏ ఒక్కటి విస్మరించినా ఊహించని స్థాయిలో నష్టం జరుగుతుంది.

మున్సిపల్ ఎన్నికల్లో 94 శాతం స్ట్రైక్ రేటుతో కూటమి ఘన విజయం సాధించిందని, పండగ చేసుకోవడం కాదు. నేడు జరుగుతున్న పరిషత్ ఎన్నికలలో కూడా కూటమి పార్టీలు అంతే పట్టుదలగా పనిచేయాలని, ఇది విశ్రాంతి తీసుకునే సమయం కాదని సీఎం చంద్రబాబు నాయుడు హితవు పలికారు.

‘మున్సిపోల్స్’ జరిగిన పొరపాట్లు వెంటనే గుర్తించాము కనుక వాటిని సరి చేసుకొని ఈ ఎన్నికల్లో నూటికి నూరు శాతం గెలుచుకునేందుకు అందరూ కృషి చేయాలని సిఎం చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు.

అలాగే తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు అండగా నిలబడి వారికి అవసరమైన సహాయ కార్యక్రమాలు చేపట్టాలని సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు.

అలాగే వైసీపీ సొంత మీడియా, సోషల్ మీడియాలో చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎప్పటికప్పుడు గట్టిగా తిప్పి కొడుతూ ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తూ ఉండాలని సిఎం చంద్రబాబు నాయుడు ముఖ్య నేతలను ఆదేశించారు.

అమరావతి మునిగిపోయిందంటూ సోషల్ మీడియాలో చేస్తున్న దుష్ప్రచారమే ఇందుకు నిదర్శనం. అమరావతిపై విషం కక్కినందుకే మున్సిపల్ ఎన్నికలలో ఘోర పరాజయం పాలైనప్పటికీ, వైసీపీ తీరు మారకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.

ప్రభుత్వాలు ఎన్నికలు నిర్వహించడం లేదా ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడం సర్వసాధారణమే. కానీ ప్రతిపక్ష అల్లర్లు, కుట్రలను కూడా ఎదుర్కోవాల్సి రావడమే బాధాకరం.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

కేసీఆర్ అజ్ఞాతం బిఆర్ఎస్ కు వరమా.? శాపమా.?

తెలంగాణ తెచ్చిన నేతగా, ప్రత్యేక తెలంగాణ మొదటి సీఎంగా దశాబ్దం పాటు కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. అయితే 2023…

29 minutes ago

Tyson Naidu’s Madarasi: A Folk-Based Track

Bellamkonda Sai Sreenivas’ upcoming film Tyson Naidu, directed by Saagar K Chandra, is getting ready…

45 minutes ago