
పుష్ప-2 విడుదలైన తర్వాత దానిలో అల్లు అర్జున్ నటన, ఆ సినిమా కలెక్షన్స్, బాలీవుడ్‌పై టాలీవుడ్, దక్షిణాది సినిమాల ప్రభావం తదితర అనేక అంశాలపై విస్తృతంగా చర్చలు జరిగాయి. అదే విదంగా అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో వివిద కోణాలలో చర్చలు, విశ్లేషణలు కూడా జరుగుతున్నాయి.
వాటికంటే ముందుగా చెప్పుకోవలసిన ఓ మాట ఒకటుంది. ఈ 2024 సంవత్సరం అల్లు అర్జున్ జీవితంలో అత్యంత గొప్పది.. అలాగే అత్యంత దూరదృష్టకరమైనది.
ఓ పక్క పుష్ప-2తో అల్లు అర్జున్ పేరు దేశమంతా మారుమ్రోగిపోతుంటే, అదే సినిమా కారణంగా ఆయన జీవితంలో అత్యంత దురదృష్టకరమైన, అవమానకరమైన పరిస్థితిని నిన్న ఎదుర్కోవలసి వచ్చింది. అదీ… పుష్ప-2 విడుదలైన వారంలోపుగా.. కలెక్షన్స్ ప్రభంజనం సృష్టిస్తున్నప్పుడు!ఓకే నెలలో.. వారం రోజుల వ్యవధిలోనే ఒక వ్యక్తి జీవితంలో ఇంత ఎత్తుకు ఎదిగి, ఇంత దిగువకు పడిపోవడం చాలా అరుదే కదా?
అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఈవిదంగా ఎందుకు వ్యవహరించింది?అని అందరూ ప్రశ్నిస్తున్నారు. వారి ప్రశ్నలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్ననే సమాధానం చెప్పారు. కనుక ఇప్పుడు ఆ చర్చ అవసరం లేదు.
కానీ రేవంత్ రెడ్డి నిర్ణయం సరికాదని ప్రతిపక్షాలు, ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. అల్లు అర్జున్ క్రిమినల్ లేదా ఉగ్రవాది కాదు. అనాలోచితంగా జరిగిన ఆ విషాదఘటనకు ఆయనని బాధ్యుడిని చేసి అరెస్ట్ చేయడం సరికాదని, అల్లు అర్జున్ విషయంలో అంత తొందరపాటు తగదని సామాన్యులు మొదలు సినీ, రాజకీయ ప్రముఖుల వరకు పలువురు అభిప్రాయపడుతున్నారు.
అల్లు అర్జున్ అరెస్ట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అభద్రతాభావాన్ని బయట పెట్టిందని బిఆర్ఎస్ పార్టీ ట్వీట్ చేసింది. ఓ సినీ నటుడు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి అ భద్రతాభావం దేనికి?ఇది చాలా ఆలోచింపజేస్తుంది. దీనిపై తర్వాత వేరేగా చర్చించుకోవచ్చు.
బిఆర్ఎస్, వైసీపీలు ఎలాగూ అల్లు అర్జున్‌కి మద్దతు ప్రకటిస్తాయని, ఈ పేరుతో అవి రాజకీయాలు చేస్తాయని అందరూ ఊహించిందే. కానీ ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు, మెగాస్టార్ చిరంజీవి వంటివారు సైతం అల్లు కుటుంబానికి సంఘీభావం తెలిపారు. రాజకీయాలకు, అల్లు-మెగా కుటుంబ విభేధాలకు అతీతంగా వారు స్పందించి చాలా హుందాగా వ్యవహరించారు.
సినీ పరిశ్రమలో మిగిలిన పెద్ద హీరోలు ఎందుకు స్పందించలేదని కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే అల్లు అర్జున్, అక్కినేని నాగార్జున విషయంలో ఇంతగా స్పందిస్తున్నవారు, మోహన్ బాబు విషయంలో ఎందుకు స్పందించడం లేదు?అనే ప్రశ్నకు సమాధానం లభించదు.
మోహన్ బాబు మీడియా ప్రతినిధిపై దాడి చేస్తే పోలీసులు ఆయనపై హత్యాయత్నంగా కేసు నమోదు చేశారు! అల్లు అర్జున్ కేసులో ఓ మహిళ చనిపోగా ఆమె కుమారుడు మృత్యువుతో పోరాడుతున్నాడు. కానీ అల్లు అర్జున్‌కి మద్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు మోహన్ బాబుకు ముందస్తు బెయిల్ నిరాకరించింది!
మోహన్ బాబు, మంచు విష్ణు, మనోజ్ ముగ్గురూ కూడా మీడియాకు, సదరు ప్రతినిధికి బేషరతుగా క్షమాపణలు చెప్పుకున్నా ఎవరూ ఆయనని క్షమించలేకపోతున్నారు. ఎందువల్ల?తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ నటులలో ఒకరైనా మోహన్ బాబు పట్ల సినీ పరిశ్రమకు ఈ వివక్ష ఎందుకు?వంటి ప్రశ్నలు అల్లు అర్జున్ అరెస్టుతోనే ఉత్పన్నం అవుతున్నాయి.
Ask people who directed a hit film most of the people have an answer. Ask…
For decades, Jantar Mantar in Delhi has been an important location for public protests and…