
ఈ లుక్ కోసం అల్లు అర్జున్ తయారు అవుతున్నట్టుగా ఉంది. రాష్ట్రంలోనే ఎత్తైన జలపాతంగా పేరొందిన ఆదిలాబాద్ జిల్లాలోని కుంటాల జలపాతాన్ని అల్లు అర్జున్ శనివారం స్నేహితులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కొందరు అభిమానులు అతనిని తమ కెమెరాలలో బంధించారు. రింగులు తిరిగిన జుట్టు… మాసిన గడ్డం… కండలతో అల్లు అర్జున్ మాస్ లుక్ అదిరిపోయింది.
తనని చూడటానికి వచ్చిన అభిమానులకు అభివాదం చేసుకుంటూ వెళ్లిపోయారు. అటవీ శాఖ అధికారులు దగ్గరుండి జలపాతం ప్రత్యేకతను ఆయనకు వివరించారు. కరోనా నేపథ్యంలో పర్యాటకులను అనుమతించని అధికారులు.. ప్రముఖులకు మాత్రం మర్యాదలు చేయడం ఏమిటన్న విమర్శలు స్థానికుల నుంచి వచ్చాయి.
ఇటీవల నిర్మాత దిల్ రాజు కుటుంబంతో జలపాతాన్ని సందర్శించారు. వీరికి అనుమతి వెనుక అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశాలున్నట్లు తెలుస్తోంది. మరోవైపు… పుష్పా షూటింగ్ ఎప్పుడు మొదలు అవుతుంది అనేదాని మీద ఎటువంటి సమాచారం ఇప్పటివరకూ లేదు.
Royal Challengers Bengaluru defeated Mumbai Indians by 2 wickets in a thrilling last-ball match in…
After facing a series of disappointments at the box office, actor Ram Pothineni now appears…