Telugu

అల్లు అర్జున్ పాన్ – ఇండియా లెవెల్ మిస్టేక్?

థియేటర్లలో సాధారణ పరిస్థితులు వస్తుండడం… అలాగే 50% ఆకుపెన్సీ రూల్ ని కూడా సడలించనున్నట్టు వార్తలు రావడంతో పెద్ద హీరోలు కూడా తమ సినిమాల విడుదల తేదీలను ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన తదుపరి చిత్రం, పుష్ప విడుదల తేదీని కాసేపటి క్రితం అధికారికంగా ప్రకటించాడు.

ADVERTISEMENT

పుష్ప ఆగ‌స్ట్ 13న ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఏక‌కాలంలో 5 భాష‌ల్లో భారీగా విడుద‌ల‌ అవుతుందని చిత్రబృందం ప్రకటించింది. ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా మ‌న్య ప్రాంతం మారేడిమిల్లి డీప్ ఫారెస్ట్ లో పుష్ప షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. అయితే ఈ రిలీజ్ డేట్ పై భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం ఆదివారం వచ్చింది. కావున హోలీ డే ఎఫెక్ట్ ఉండదు. అది పక్కన పెడితే.. తెలుగు తప్ప ప్రతీ భాషలో సహజంగా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పెద్ద సినిమాలు విడుదల ఖచ్చితంగా ఉంటుంది. అల్లు అర్జున్ మొట్ట మొదటి పాన్-ఇండియా చిత్రం కాంపిటీషన్ లో విడుదల అవ్వడం మంచి ఆలోచన కాకపోవచ్చు.

దీనితో పాన్ – ఇండియా ఎడ్వాంటేజ్ నష్టపోతారు అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడిప్పుడే దేశంలోని సినీ ప్రేమికులంతా తెలుగు ఇండస్ట్రీ వైపు చూస్తున్నారు. అల్లు అర్జున్ కు ఇది మంచి అవకాశం. సుకుమార్ నటిస్తున్న ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

RGV’s Police Company Starts With AI Controversy

Ram Gopal Varma has announced his new film Police Company, which is scheduled to hit…

25 minutes ago

Ranabaali: Where Exactly Vijay Deverakonda Going Wrong?

Vijay Deverakonda seems to be going through a disastrous and confusing phase in his career,…

55 minutes ago