
మంగళవారం రాత్రి కూడా ఆహాకు సంబంధించి ఒక ఈవెంట్ కు హాజరయ్యాడు బన్నీ. అయితే ఆయన గెస్టుగా హాజరైన ప్రతి ఈవెంట్లోనూ పుష్ప సినిమా గురించే ప్రస్తావిస్తుండటం కొంత మంది జనాలకు అస్సలు నచ్చడం లేదు. అంతేకాదు ప్రతి ఈవెంట్ లోనూ పుష్ప సినిమా గురించి మాట్లాడటం….మాట్లాడిన ప్రతిసారి తగ్గేదే లేదంటూ డైలాగులు విసురుతూ ఫ్యాన్స్ భారీ ఆశలు కల్పిస్తున్నాడు. కానీ బన్నీ డైలాగులు వింటుంటే మాత్రం ఇతర నటుల ఫ్యాన్స్ మాత్రం తెగ చిరాకు పడుతున్నారు.
ఇదంతా పుష్ప మూవీ హైప్ కోసమే అంటున్నారు. పుష్ఫ సినిమా పై మనోడు బాగానే ఆశలు పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. ఒకవేళ బన్నీ అనుకున్నట్లు ఈ మూవీ హీట్ కాకుండా ఫట్ట్ అయితే పరిస్థితేంటీ…బన్నీ ఏమైపోతాడో అంటూ జనాలు ఎద్దేవా చేస్తున్నారు. పుష్ప సినిమా ప్రమోషన్ ఎక్కువైతుందంటూ సైటైర్లు వేస్తున్నారు. స్టార్ హీరోలు అన్నప్పుడు తక్కువగా కనిపించడం…తక్కువగా మాట్లాడితేనే…వారికి క్రేజ్ ఉంటుంది. అంతేకాదనీ నెలకు నాలుగు ఈవెంట్లలో కనిపిస్తూ…తమ క్రేజ్ చూపించుకునే ప్రయత్నం చేస్తే…. ప్రేక్షకులకు చిరాకు రావడం ఖాయం.
The year of 2026 is not over yet, and it has already delivered two big…
Tollywood has a long-running joke about the so-called Rajamouli curse. The belief is that a…