Telugu

రాయపాటి అరుణ.. ఓ వీర మహిళ పోరాటం, ఆవేదన

‘మున్సిపోల్స్’లో కూటమి ఘన విజయం సాదించడంతో మూడు పార్టీల శ్రేణులు పండగ చేసుకుంటున్నారు. మరోపక్క వైసీపీ కార్యాలయాలు వెలవెలబోతున్నాయి. ఈ రెండింటితో పాటు ఈ ఎన్నికలలో ఓడిపోయిన లేదా నాయకుల చేతిలో మోసపోయిన వారి కథలు కూడా వినిపిస్తున్నాయి.

ఒంగోలు జిల్లాకు చెందిన జనసేన అధికార పార్టీ ప్రతినిధి, వీర మహిళ రాయపాటి అరుణ కూడా అటువంటి వారిలో ఒకరు. ఆమె ‘ఎక్స్‌’లో ఓ పెద్ద పోస్ట్ పెట్టారు.

ADVERTISEMENT

దానిలో… ఈ ఎన్నికలలో తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి ఆమె చెప్పింది జనసైనికుల మనోభావాలను ప్రతిభింబిస్తున్నట్లే అనిపిస్తుంది. ముఖ్యంగా జనసేన అధిష్టానం ఇలాంటి విషయాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఈ లేఖ స్పష్టం చేస్తోంది.

ఆమె ఏమన్నారో క్లుప్తంగా, “ఈ ఎన్నికలు… ఈ ఓటమి నాకు చాలా విలువైన రాజకీయ పాఠాలు నేర్పాయి. నా శ్రమ, నిబద్దత, డబ్బు, అన్నీ వృధా అయ్యాయి. అయితే నా ప్రయత్నలోపం వలన కాక, పార్టీలోనే కొందరు వ్యక్తులు, మిత్రపక్షానికి చెందిన కొందరు ఆడిన ‘డబుల్ గేమ్స్’ వలన ఓడిపోయినందుకు నేను చాలా బాధపడుతున్నాను.

స్థానికంగా ఉన్న నన్ను కాదని కూటమి రాజకీయ శత్రువు వైసీపీ నుంచి వచ్చిన వ్యక్తికి కండువా కప్పి అభ్యర్ధిగా ఖరారు చేశారు. అయినప్పటికీ పెద్దల సూచన మేరకు నేను నాకు పరిచయం లేని ‘త్రోవగుంట’లో నామినేషన్స్‌ వేశాను. కానీ అక్కడా ‘నాకు ఓట్లు వేయవద్దని.. మన కులపు అమ్మాయికే ఓట్లు వేయమని’ అంతర్గతంగా ప్రచారం చేశారు. తత్ఫలితంగా 100కి పైగా ఓటర్లు ఒక బూత్ పరిధిలో మేయర్‌ అభ్యర్ధికి ఓటు వేసి, నాకు ఓటు వేయకుండా బ్యాలెట్ పేపర్ మడత పెట్టి డబ్బాలో వేశారు. కౌంటింగ్ సమయంలో అది చూసి చాలా బాధ పడ్డాను.

ఓ పక్క వైసీపీతో, మరోపక్క సొంత మనుషులతో పెద్ద యుద్ధమే చేశాను. కానీ ఓడిపోయాను.

కానీ నేను వీర మహిళను. ఈ ఓటమి వలన కలిగే బాధ కంటే ఈ ఎన్నికల ద్వారా నేర్చుకున్న అనేక కొత్త విషయాలు మున్ముందు నాకు బాగా ఉపయోగపడతాయని గట్టిగా నమ్ముతున్నాను.

నేను ఓడిపోయినా ‘త్రోవగుంట’లో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం వారికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను. వారి సమస్యల పరిష్కారానికి నా శక్తిమేర కృషి చేస్తానని రాయపాటి అరుణ పేర్కొన్నారు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Raaka Release: Is Atlee’s Grand Vision Causing a Delay?

Allu Arjun's next big-screen outing may still be some distance away. His upcoming film Raaka,…

13 minutes ago

Radhika Apte Fiasco: Keerthy’s Smile Sparks Controversy!

A casual moment during a promotional interview has landed Keerthy Suresh in an unexpected social…

44 minutes ago