అల్లు అర్జున్‌ ఇకనైనా ఓపెన్ అయితే మంచిది

అల్లు అర్జున్‌ ఏనాడూ జగన్‌ లేదా వైసీపీకి మద్దతు ఇవ్వలేదు. కానీ వైసీపీకి చెందిన శిల్ప చంద్రరెడ్డి తన స్నేహితుడు కనుక ఎన్నికల సమయంలో నంద్యాల వెళ్ళి సంఘీభావం తెలిపారు. అంతకు మించి అల్లు అర్జున్‌కి వైసీపీతో ఎటువంటి సంబందమూ లేదు.

కానీ అల్లు అర్జున్‌ వైసీపీ అభ్యర్ధికి మద్దతు ఇవ్వడం అంటే మొత్తం వైసీపీకి మద్దతు ఇచ్చిన్నట్లేనని, అతను తమవైపే ఉన్నారన్నట్లు ఊహించేసుకొని, అల్లు అర్జున్‌ని వెనకేసుకు రావడం మొదలుపెట్టింది. దాని వలన అల్లు అర్జున్‌కి మేలు కలుగకపోగా కీడే జరిగింది.

ADVERTISEMENT

ఆయన జనసేన, పవన్ కళ్యాణ్‌లను, టీడీపీ, చంద్రబాబు నాయుడులను వ్యతిరేకిస్తున్నారనే భావన ప్రజలకు కలిగేలా చేయగలిగింది వైసీపీ.

కనుక అప్పుడే అల్లు అర్జున్‌ దానిని ఖండించి ఉండి ఉంటే ఇన్ని అపోహలు, అనుమానాలు కలిగి ఉండేవి కావు. కానీ రాజకీయాలకు దూరంగా సినిమాలు చేసుకుంటున్నప్పుడు ఈ గొడవలు మనకెందుకని అల్లు అర్జున్‌ వైసీపీ ప్రచారాన్ని పట్టించుకోలేదు.

దాంతో వైసీపీ మరో అడుగు ముందుకు వేసి పుష్ప-2 సినిమా రిలీజ్ అయినప్పుడు చాలా హడావుడి చేసింది. దీంతో సామాన్య ప్రజలు కూడా అల్లు అర్జున్‌ వైసీపీ వైపే ఉన్నారని నమ్మడం మొదలుపెట్టారు.

అల్లు అర్జున్‌ వైసీపీ వైపు ఉన్నారు కనుక చంద్రబాబు నాయుడే కక్ష కట్టి రేవంత్ రెడ్డితో మాట్లాడి అరెస్ట్‌ చేయించారని వైసీపీ జోరుగా ప్రచారం చేసింది. ఆ దుష్ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టడంలో టీడీపీ సోషల్ మీడియా కాస్త అలసత్వం ప్రదర్శించింది.

కనుక అల్లు అర్జున్‌ అరెస్ట్‌ విషయంలో వైసీపీ చేస్తున్న ఆరోపణలు కూడా నిజమేనని ప్రజలు నమ్మే పరిస్థితి ఏర్పడింది.

చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌ ఇద్దరూ ఈ విషయం బాగానే గ్రహించారు. వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టారు. అల్లు అర్జున్‌ని ధైర్యంగా ఉండమని సిఎం చంద్రబాబు నాయుడు తరపున సీఎంవో అధికారులు ఫోన్ చేసి మాట్లాడగా, నేడు పవన్ కళ్యాణ్‌ అల్లు అర్జున్‌ ఇంటికి వెళ్ళి కలవబోతున్నారు.

ఇప్పటికే చిరంజీవి దంపతులు వెళ్ళి అల్లు అర్జున్‌కి ధైర్యం చెప్పి వచ్చారు. అల్లు అర్జున్‌ వెనుక చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌, చిరంజీవి అందరూ ఉన్నామని చాలా స్పష్టంగా చెప్పారు. కనుక ఇప్పటికైనా అల్లు అర్జున్‌ తనకీ వైసీపీకి ఎటువంటి సంబందమూ లేదని, జనసేన, టీడీపీలకే నా మద్దతు అని స్పష్టమైన ప్రకటన చేస్తే అనుమానాలు, అపోహలు అన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా వైసీపీ బెడద వదిలిపోతుంది. ఎప్పటిలాగే అల్లు అర్జున్‌ అందరివాడు అవుతారు. కానీ చేయకపోతే ఆయన ఈ అవకాశాన్ని చేజార్చుకున్నట్లే అవుతుంది. ఇంత జరిగినా ఆయన వైసీపీతోనే ఉన్నారని ప్రజలు, టీడీపీ, జనసేన అందరూ గట్టిగా నమ్ముతారు. ఇది అల్లు అర్జున్‌కి ఎంత మాత్రం మంచిది కాదు.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

ఇండి కూటమి ‘యాంటీ’ ఇండియా రాజకీయం చేస్తుందా.?

గత కొన్ని రోజులుగా బీజేపీ టార్గెట్ గా ముఖ్యంగా మోడీ కార్నర్ గా ఢిల్లీ వేదికగా జరుగుతున్న కాక్రోచ్ల రాజకీయం,…

27 minutes ago

Amaravati Railway Line Likely by 2028-29, Tenders Progress

Amaravati could get railway connectivity by late 2028 or early 2029 through a 57-km railway…

27 minutes ago