
బన్నీ సతీమణి స్నేహారెడ్డి పొట్ట మీద అయాన్ ముద్దు పెడుతూ ఉన్న ఈ ఫోటో చూడముచ్చటగా ఉండడంతో అభిమానులు సోషల్ మీడియాలో ఈ ఫోటోను షేర్ చేసుకుంటూ సందడి చేస్తున్నారు. బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న ఈ ఫోటోలో అయాన్ కాబోయే తమ్ముడికో, చెల్లెలికో అప్పుడే ముద్దులు పెట్టేస్తున్నాడు అంటూ నెటిజన్లు ఇస్తున్న కామెంట్స్.
వరుస సక్సెస్ లతో మాంచి ఊపు మీద ఉన్న బన్నీ… అసలు విషయాన్ని చెప్పేసాడు గానీ, వచ్చేది మరో వారసుడో, వారసురాలో అన్న ఆసక్తి సహజంగానే అభిమాన వర్గాల్లో హల్చల్ చేస్తోంది. మొదటి వాడు అబ్బాయి కాబట్టి, ఇప్పుడు అమ్మాయి కావాలనుకోవడం ఏ కుటుంబంలో అయినా సహజంగా వినిపించే మాటలే. మరి బన్నీని దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడో చూడాలి.
Playback singer Swagatha S. Krishnan has made serious allegations against an unnamed music director from…
Kollywood film Immortal starring G V Prakash Kumar and Kayadu Lohar in the lead roles…