
పూజా హెగ్డే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. గతంలో త్రివిక్రమ్‌తో ‘అరవింద సమేత వీర రాఘవ’లో సినిమాలో కథానాయిక నటించింది. ఇంకోవైపు బన్ని హీరోగా నటించిన ‘డీజే’ లో కథానాాయికగా నటించిన సంగతి తెలిసిందే కదా. అల్లు అర్జున్‌తో నటించిన ఈ సినిమాతోనే కథానాయికగా పూజా హెగ్డే దశ తిరిగింది. ఈ సినిమా అంతగా సక్సెస్ కాలేకపోయిన హీరోయిన్గా వరుస అవకాశాలను తీసుకొచ్చింది. థమన్ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నారు.
గతంలో అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఆ రెండు సినిమాల పాటలు పెద్ద హిట్ అయ్యాయి. అయితే దేవి ఈ మధ్య ఫార్మ్ లో లేకపోవడంతో తమన్ ను తీసుకుంది చిత్రబృందం. దీనితో తమన్ పై ఎక్కువ బాధ్యత ఉంది. మరోవైపు ఈ సినిమాలో ఒక ఐటెం సాంగ్ ఉండబోతుందని, దానికోసం కాజల్ ను తీసుకున్నట్టు కూడా వార్తలు వచ్చాయి.
రామాయణ, మహాభారతాల ఆధారంగా అనేక భాషల్లో అనేక సినిమాలు వచ్చాయి. అయినా ఇంకా తీస్తూనే ఉన్నారు. మరో వందేళ్ళ తర్వాత…
A massive data leak at the Central Board of Film Certification (CBFC) has exposed records…