
అభిమానులు, పోలీసుల భద్రత మధ్య ఆలయంలోకి ప్రవేశించి దర్శనం అయిపోయిన తర్వాత లిఫ్ట్ లో క్రిందికి దిగుతున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు బోయపాటి శ్రీను లిఫ్ట్ లో చిక్కుకోవడంతో కాసేపు గందరగోళ పరిస్థితి ఏర్పడింది. రెండు అంతస్తుల మధ్య లిఫ్ట్ ఆగిపోయిన సందర్భంలో దాదాపు అయిదారు నిముషాల వరకు ఆలయ ప్రధాన అర్చకులతో పాటు ఇద్దరూ లిఫ్ట్ లో ఇరుక్కుపోయారు. అయితే, వెంటనే స్పందించిన ఆలయ అధికారులు, లిఫ్ట్ తలుపులను బలవంతంగా తెరిచి ‘సరైనోడు’ సినిమా హీరో, దర్శకులను బయటకు తీసుకు వచ్చారు.
అల్లు అర్జున్ ను చూసేందుకు గుడి వద్దకు పెద్ద సంఖ్యలో వచ్చిన మెగా అభిమానులు చేరుకోవడంతో ఈ వార్తతో ఆందోళనకు గురయ్యారు. అనంతరం బన్నీపై రకరకాల వార్తలు దావానంలా వ్యాపించాయి. అల్లు అర్జున్ కు ఏదో జరిగిందంటూ జరిగిన ప్రచారంలో ఎక్కడా నిజం లేదు, ఆలయ ప్రాంగణంలో జరిగిన చిన్న విషయం పెద్ద దుమారాన్ని రేపింది. అయితే ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Raymond Sookram of Cherokee County, Georgia, was arrested earlier this week. He has been charged…
BOTTOM LINE Superficial Remake, A Major Misfire PLATFORM PRIME VIDEO RUNTIME 4 Hrs 12 Mins…