
2021 డిసెంబర్ 17 న పాన్ ఇండియా వైడ్ గా విడుదలయ్యి మొదట నెగటివ్ టాక్ వచ్చినా, క్రమ క్రమాన సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని నార్త్ ఇండియా లో మోత మోగించింది పుష్ప. ఆ సమయంలో, అంత భారీ ప్రమోషన్లు లేకుండానే నార్త్ అంతా పుష్ప వైపు చూసింది, తగ్గేదెలా అంటూ దూసుకెళ్లింది.
మరి ఈసారి నార్త్ నే టార్గెట్ గా పెట్టుకుని చిత్ర యూనిట్ ప్రమోషన్లు షురూ చెయ్యనున్నారు. ఇప్పటికే వచ్చిన ‘వేర్ ఈజ్ పుష్ప’,టీజర్ క్లిప్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. విడుదల చేసిన కంటెంట్ అంతా అభిమానులను, ఇండస్ట్రీ వర్గాలను మెప్పించింది. ఫహద్ ఫాసిల్,సునీల్, అనసూయ, రష్మిక వంటి స్టార్ కాస్ట్ ఫస్ట్ పార్ట్ లో భాగమవ్వగా, వారి కేరక్టర్స్ మళ్ళీ సెకండ్ పార్ట్ లో దర్శనమివ్వనున్నాయి.
ఫస్ట్ పార్ట్ లో ‘ఊ అంటావా, ఉ ఊ అంటావా’ పాట కోసం సమంత ను స్పెషల్ సాంగ్ కు ఒప్పించిన పుష్ప చిత్ర బృందం, ఈసారి ఆ స్పెషల్ సాంగ్ కోసం ‘శ్రీలీల’ ను వెండితెర మీదకు తెచ్చారు. ఇక, నవంబర్ 17 న విడుదల కానున్న ట్రైలర్ పై పాన్ ఇండియా స్థాయిలో అంచనాలు భారీ గా ఉన్నాయి.
ఇప్పటికే ప్రీ-రిలీజ్ బిజినెస్ ను ముగించుకున్న పుష్ప-2 , రికార్డు బిజినెస్ ను సొంతం చేసుకుంది. ఏకంగా 1000 కోట్లకు పై బడి బిజినెస్ జరిగిందని సమాచారం. మరి ఇంతటి భారీ లక్ష్యం తో థియేటర్ల ముందుకు రానున్న పుష్ప ప్రమోషన్స్ లో తగ్గుతుందా.
ఇటీవలే, ఫ్రీ ఫైర్, డార్క్ ఫాంటసీ, గోల్డ్ మెడల్, ఆస్ట్రల్ పైప్స్, థమ్స్ అప్, కజారియా, దావత్, కళ్యాణ్ జ్యులర్స్, జె.కె.టైర్స్, టీ.వీ.ఎస్ వంటి బడా బడా బ్రాండ్స్ తో ప్రొమోషన్ కొలాబరేషన్ ప్రకటించారు.
ఇక నవంబర్ 17 న పాట్నా వేదికగా పుష్ప-2 సినీ యూనిట్ లాంఛనంగా ట్రైలర్ ను విడుదల చేయనుండగా, ఇటు ఫాన్స్ ఇప్పటికే బొమ్మ పక్కా హిట్ అంటూ సంబరపడుతున్నారు.
విడుదలైన పుష్ప పుష్ప పుష్పరాజ్, సూసేకి అగ్గి రవ్వ మాదిరి…రెండు పాటలు కూడా సూపర్ హిట్ అవ్వడంతో ఇక మిగిలిన ఆ పాటలు కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు పుష్ప ఫాన్స్.
డిసెంబర్ 5 న విడుదలకు సిద్దమవుతున్న పుష్పగాడి రూలింగ్ ఎలా ఉంటుందో చూడడానికి టాలీవుడ్ తో పాటు అన్ని ఇండస్ట్రీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఇక ట్రైలర్ విడుదలతో మొదలవనున్న పుష్ప సినిమా ప్రమోషన్స్ సినిమాను ఏ స్థాయికి తీసుకువెళ్తాయో, సుక్కు పుష్పను ఎక్కడ కూర్చోబెడతారో అని ట్రేడ్ వర్గాలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు.
అయితే ఈ మధ్యకాలంలో సినిమా ప్రమోషన్స్ మీద చిత్ర బృందంగా పెద్దగా ఆసక్తి చూపించడం లేదు అనే వాదన వినపడుతున్న తరుణంలో పుష్ప ప్రమోషన్స్ లో తగ్గుతాడా లేక తగ్గేదెలా అంటూ తన మార్క్ చూపిస్తాడా అనేది వేచి చూడాలి.
The Andhra Pradesh government has reportedly finalised reservations for mayor posts in 17 municipal corporations…
Rumours about Allu Arjun and Lokesh Kanagaraj’s AA23 are spreading like wildfire. From speculation about…