
తాజాగా అలాంటి వ్యాఖ్యలనే పలికారు అల్లు శిరీష్. ఎన్నారైలతో ఓ ప్రముఖ ఛానల్ అర్ధరాత్రి 12 గంటల సమయంలో ప్రసారం చేసే ఓ కార్యక్రమంలో, ‘శ్రీరస్తు శుభమస్తు’ సినిమా హీరో అల్లు శిరీష్, దర్శకుడు పరశురాంతో ప్రేక్షకులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఇందులో భాగంగా… సినిమా విజయవంతం అయినందుకు శుభాకాంక్షలు చెప్తూ… సినిమా హీరోయిన్ లావణ్య త్రిపాఠిని కూడా తీసుకు వచ్చినట్లయితే బాగుంటుంది అన్న అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు.
అయితే దానికి స్పందించిన అల్లు శిరీష్… ‘12 గంటల సమయంలో సినిమా ప్రమోషన్ అంటే వేరే ఉద్దేశం అనుకుంటారండి’ అంటూ డబుల్ మీనింగ్ డైలాగ్ వేయడం, అతని పరిపక్వత స్థాయిని సూచిస్తుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి. ‘మా కార్యక్రమం పేరు చెప్పాల్సింది’ అంటూ కార్యక్రమ నిర్వాహక యాంకర్, కాస్త దిద్దుబాటు వ్యాఖ్యలు చేసినప్పటికీ, శిరీష్ నవ్వుతూ ఆ వ్యాఖ్యలు చేయడం విమర్శలకు దారి తీసింది.
ఇలాంటి డైలాగ్ లు పేల్చి, సామాన్య ప్రేక్షకులకు హీరోయిన్లు అంటే చులకన భావన ఏర్పడేలా చేస్తున్నారని, ముఖ్యంగా తోటి హీరోయిన్లను తక్కువ చేసి వ్యాఖ్యానించడం తగదన్న సూచనలు వ్యక్తమవుతున్నాయి. అసలే వివాదాస్పద వ్యాఖ్యలకు నిలయంగా అల్లు శిరీష్ నిలుస్తాడని ఇప్పటికే టాలీవుడ్ లో ఒక పేరుంది. దీనికి మరింత బలమిచ్చేలా ఓ లైవ్ షోలో అల్లు శిరీష్ ‘డబుల్ మీనింగ్’ డైలాగ్లు నిలుస్తున్నాయి.
Nani has big plans for The Paradise. The film is not being treated as just…
సినిమాలలో కొన్ని కథలు, ఫార్ములాలు, కాంబినేషన్‌లు సక్సస్ కావచ్చు. కానీ కొత్త ఆలోచనలు, ప్రయోగాలు చేయకుండా వాటినే పట్టుకొని వ్రేలాడుతుంటే…