Telugu

టీజర్ టాక్ – మెగా హీరో మేకోవర్ హైలైట్!

అల్లు అర్జున్ సోదరుడు శిరీష్ ను ఎలాగైనా సిల్వర్ స్క్రీన్ పై ఒక హిట్టు అందించాలన్న తాపత్రయం కనపడుతోంది. ‘గౌరవం’తో డిజాస్టర్ ను చవిచూసిన శిరీష్ కు ‘కొత్త జంట’ పర్వాలేదనిపించింది. దీంతో హిట్ అందించే బాధ్యతను స్వయంగా తండ్రి అల్లు అరవింద్ తీసుకోవడంతో… అది పరశురాం దర్శకత్వంలో “శ్రీరస్తు శుభమస్తు” రూపం దాల్చుకుంది. శిరీష్, లావణ్య త్రిపాఠిలు జంటగా నటించిన ఈ సినిమా ఫోటోలు ఇటీవల విడుదలై వీక్షకులను ఆకట్టుకోగా, తాజాగా టీజర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది చిత్ర యూనిట్.

ADVERTISEMENT

ఫస్ట్ టీజర్ తో ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడంలో చిత్ర బృందం సక్సెస్ అయ్యింది. గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ వాల్యూస్, అందమైన లావణ్య లుక్, థమన్ బ్యాక్ గ్రౌండ్ సంగీతం, సినిమాటోగ్రఫీ, మంచి లొకేషన్స్… మొత్తంగా టీజర్ పాస్ మార్క్ లను వేయించుకుంది. ఈ టీజర్ లో అసలు హైలైట్ ఏమిటంటే… మొదటి రెండు సినిమాల ద్వారా తన లుక్ పై విమర్శలను ఎదుర్కొన్న అల్లు శిరీష్, ఈ “శ్రీరస్తు శుభమస్తు”లో పర్వాలేదనిపించే విధంగా ఉండడం మెగా అభిమానులకు ఊరట కలిగించే విషయం. అలాగే పరశురాం గతంలో దర్శకత్వం వహించిన ‘సోలో’ సినిమా ఛాయలు కనపడుతుండడం గమనించదగ్గ విషయం.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Indian Arrested for Sexually Assaulting Teen Girl

Raymond Sookram of Cherokee County, Georgia, was arrested earlier this week. He has been charged…

32 minutes ago

Jagame Sangeetham Review: Superficial Remake, A Major Misfire

BOTTOM LINE Superficial Remake, A Major Misfire PLATFORM PRIME VIDEO RUNTIME 4 Hrs 12 Mins…

47 minutes ago