
ఈ నేపధ్యంలో ‘మెగా’ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, దీనిపై స్పష్టత ఇచ్చారు. ‘ఖైదీ నంబర్ 150’ ప్రీ రిలీజ్ వేడుకకు పవన్ కళ్యాణ్ హాజరు కావడం లేదంటూ ఓ చేదు వార్తను మెగా ఫ్యాన్స్ కు అందించారు అల్లు అరవింద్. తనకున్న సమయాభావం వలనే పవన్ రాలేకపోతున్నారని, మరో వివాదానికి ఆస్కారం ఇవ్వకుండా దీనిపై స్పష్టత ఇచ్చారు. దీంతో ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులు నిట్టూర్పును ప్రదర్శిస్తున్నారు. ఓ పక్కన ‘కాటమరాయుడు’ షూటింగ్ తో బిజీగా ఉంటూ, మరో పక్క రాజకీయ రంగంలోనూ పావులు కదుపుతున్నారు పవన్.
చిరంజీవి 150వ సినిమా చేయడానికి ఒప్పుకున్నారని ప్రకటన చేసిన తర్వాత, ముందుగా చిరు ఇంటికి వెళ్లి కలిసింది పవన్ అన్న విషయం అభిమానులకు గుర్తుండే ఉంటుంది. ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ షూటింగ్ లో ఉన్న పవన్, అదే పోలీస్ డ్రెస్ లో చిరంజీవి ఇంటికి వెళ్లి ఓ బోకే ఇచ్చిన విషయం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. మరి అలాంటి పవన్, ఈ వేడుకకు రాకపోతే, మీడియా వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యే అవకాశం ఉన్నందున, ముందుగా పవన్ పై స్పష్టత ఇవ్వడం ఉత్తమం అనుకుని భావించారో ఏమో గానీ, అల్లు అరవింద్ ప్రకటించేసారు.
For an actor, a face and voice are more than just part of their identity.…
BOTTOM LINE Dead Game! RATING 1.75/5 Director: Nahas Hidhayath Story, Screenplay: Nahas Hidhayath, Sajeer Baba…