వైసీపి అరాచకాలకు అంబటి స్వస్తి వాఖ్యాలు… సిగ్గు చేటు!

రాష్ట్రంలో మే 13న పోలింగ్‌ జరుగుతున్నప్పుడు పల్నాడు జిల్లా మాచర్లలో 202వ పోలింగ్‌ బూత్‌లోకి వైసీపి సిట్టింగ్ ఎమ్మెల్యే, అభ్యర్ధి పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి తన అనుచరులతో ప్రవేశించి ఈవీఎంని నేలకేసి కొట్టి ధ్వంసం చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఘటనపై స్పందించిన ఈసీ పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిజిపి హరీష్ కుమార్‌ గుప్తాని ఆదేశించింది.

ADVERTISEMENT

‘మా పిన్నెల్లి చాలా మంచి పిల్లోడు’ అంటూ సర్టిఫై చేసిన జగన్మోహన్‌ రెడ్డి, ఇంత జరిగిన తర్వాత కూడా ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు. కనీసం ఖండించలేదు. స్పందించలేదు. పైగా ఇప్పుడు అంబటి రాంబాబు వంటి వైసీపి నేతలను రంగంలోకి దించి టిడిపిపై ఎదురు దాడి చేస్తుండటం సిగ్గుచేటు.

పోలింగ్‌ బూత్‌లో పిన్నెల్లి ఈవీఎంని ధ్వంసం చేసిన వీడియో గురించి అంబటి రాంబాబు మాట్లాడాలనుకున్నప్పుడు ముందుగా, ‘పిన్నెల్లి చేసింది నేరం’ అని చెప్పి ఉండాలి. కానీ ఈ వీడియో నిజమైనదేనా నకిలీదా? అని ఆలోచించాలి కాదా? ఒకవేళ అది నిజమైన వీడియో అయితే అది నేరుగా నారా లోకేష్‌ ట్విట్టర్‌ ఖాతాలోకి ఎలా వచ్చింది.

దానిని జిల్లా కలెక్టర్‌, రాష్ట్ర ఎన్నికల సంఘం లేదా రిటర్నింగ్ ఆఫీసర్ విడుదల చేసి ఉండాలి. కానీ అది ముందుగా నారా లోకేష్‌ ఖాతాలో ఎలా ప్రత్యక్షమైంది? దీనిని బట్టి టిడిపితో ఎన్నికల సంఘం అధికారులు కుమ్మక్కు అయిన్నట్లు స్పష్టం అవుతోంది. ఒకవేళ పిన్నెల్లి నిజంగానే తప్పు చేసి ఉంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది,” అని అంబటి రాంబాబు అన్నారు.

అలాగే మరికొందరు వైసీపి నేతలు కూడా మీడియా ముందుకు వచ్చి రకరకాల కధలు చెప్పారు తప్ప వారిలో ఓ ఒక్కరూ పిన్నెల్లి చేసింది తప్పు అని చెప్పలేదు.

ఇంతకాలం వైసీపి చేసిన అరాచకాలకు టిడిపి, జనసేనలు బలైపోయాయి. ఆ రెండు పార్టీలు ఎన్ని సాక్ష్యాధారాలు చూపినా జగన్మోహన్‌ రెడ్డితో సహా వైసీపి నేతలు కొట్టిపడేసేవారు. వెబ్‌క్యాస్టింగ్ గురించి తెలియక రెచ్చిపోయిన పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి సిసి కెమెరాలో అడ్డంగా దొరికిపోయి, పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతుంటే, వైసీపి నేతలు ఈవిదంగా నిసిగ్గుగా సమర్ధించుకుంటున్నారు.

వైసీపి అరాచకాలకు ఈ ఘటన పరాకాష్టగా చెప్పుకోవచ్చు. అరాచకాల విషయంలో వైసీపి నేతల ధోరణి ఏవిదంగా ఉంటుందో అంబటి రాంబాబు మాటలే ఓ చక్కటి నిదర్శనం. ఈ అరాచకాలు, అరాచక ధోరణులు జూన్ 4 తర్వాత ముగుస్తాయనే ఆశిద్దాం.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Recent Posts

Big Breaking: Jantar Mantar No Longer For Protests!

For decades, Jantar Mantar in Delhi has been an important location for public protests and…

17 minutes ago

ఇండి కూటమి ‘యాంటీ’ ఇండియా రాజకీయం చేస్తుందా.?

గత కొన్ని రోజులుగా బీజేపీ టార్గెట్ గా ముఖ్యంగా మోడీ కార్నర్ గా ఢిల్లీ వేదికగా జరుగుతున్న కాక్రోచ్ల రాజకీయం,…

46 minutes ago