
ఒక అమ్మాయికి ఒక అబ్బాయి సహాయం చేస్తే, వారిద్దరి మధ్య ఏదో ఉన్నట్టేనా? అని ప్రశ్నించింది. ఎలాంటి సంబంధం లేకుండా ఒక అమ్మాయికి సహాయం చేయకూడదా? ప్రతి విషయంలోనూ అమ్మాయిలనే టార్గెట్ చేస్తున్నారని… మగవాళ్లని మాత్రం ఏమీ అనరని చెప్పింది. అలాగే విడాకులు తీసుకున్న తర్వాత హాట్ హాట్ డ్రెస్ లు ధరిస్తోంది అన్న వ్యాఖ్యలపై కూడా అమలాపాల్ మండిపడింది.
గ్లామర్ డ్రెస్ లు వేస్తే… ఒకప్పుడు తనను ‘ఫ్యాషన్ ఐకాన్’ అంటూ పొగిడారని, ఇప్పుడేమో విమర్శిస్తున్నారని, విడాకులు తీసుకున్నంత మాత్రాన మోడ్రన్ డ్రెస్ లు వేసుకోకూడదా? అని ప్రశ్నించింది. ఎవరు ఏమనుకున్నా తన శరీరానికి సరిపోయే డ్రెస్ లను తానూ వేసుకుంటానని కుండబద్దలు కొట్టింది. గ్లామర్ గా కనిపించకపోతే… విడాకులు తీసుకుని బాధపడుతోందంటూ మీరే విమర్శిస్తారని మండిపడింది.
Raaka is already shaping up to be one of the most ambitious films of Allu…
Dhanush is currently one of the busiest actors in Kollywood with multiple projects in his…