
[m9ad]
సాధారణంగా శ్రీను వైట్ల సినిమాలో హీరో హీనపక్షంగా రెండు గెటప్ లు, స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే ఎన్ని వేస్తారో అంతేలేదు. మరి అలాంటి శ్రీను వైట్ల “అమర్ అక్బర్ అంటోనీ” సినిమాలో రవితేజను మూడు గెటప్ లలో చూపిస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయడంతో, రవితేజ చేస్తోంది ట్రిపుల్ రోలా? లేక ఒకే క్యారెక్టర్ తో మూడు గెటప్ లు మార్పిస్తున్నారా? తెలియాల్సి ఉంది.
ఏది ఏమైనా మాస్ మహారాజా అభిమానులకు మాత్రం పండగ లాంటి పోస్టర్ ను రిలీజ్ చేసారు శ్రీను వైట్ల. ఈ సినిమా ద్వారా గోవా బ్యూటీ ఇలియానా టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. టాలీవుడ్ లో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ ను సాధించిన మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తుండగా, ఎస్.ఎస్.థమన్ స్వరాలు సమకూరుస్తున్నారు.
Following its Los Angeles premiere, Ramayana: Part 1 has received mixed reactions from viewers. While…
Keerthy Suresh has spent years stepping into characters written by others. Now, she has been…