
రాష్ట్రానికి కొత్తగా పరిశ్రమలు తీసుకురాకపోగా ఉన్నవాటిని రాజకీయ కక్షలకు బలిచేస్తుంటే ఏ పారిశ్రామికవేత్త అయినా ఏం చేస్తారు? గల్లా జయదేవ కూడా అదే చేశారు. ఆంధ్రప్రదేశ్లోనే పెట్టుబడి పెట్టాలని ఆయన భావించినప్పటికీ రాష్ట్రంలో ఈ కక్ష సాధింపులు, వైసీపీ నేతల వేధింపులు భరించలేక తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమని స్థాపించబోతున్నారు. అదీ… వందో రెండు వందల కోట్ల పెట్టుబడి కాదు ఏకంగా రూ.9,500 కోట్లు భారీ పెట్టుబడితో!
అంత భారీ పెట్టుబడితో తెలంగాణలో పరిశ్రమ స్థాపించడానికి వచ్చిన గల్లా జయదేవ్ని ఆ రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ సాదరంగా ఆహ్వానించి, ఆ పరిశ్రమ స్థాపించేందుకు రాయితీలు, ప్రోత్సాహకాలు ఇచ్చి స్వాగతం పలికారు. భారతదేశంలో అతి పెద్ద లిథియం ఐయాన్ గిగా సెల్ తయారీ పరిశ్రమని అమర్ రాజా బ్యాటరీస్ తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నందుకు మంత్రి కేటీఆర్ చాలా సంతోషం వ్యక్తం చేశారు. దీని కోసం మంత్రి కేటీఆర్, అమర్ రాజా సంస్థ ఎండీ హోదాలో ఎంపీ గల్లా జయదేవ్ సమక్షంలో సంస్థ ప్రతినిధులు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
ఆంధ్రప్రదేశ్కి చెందిన పారిశ్రామికవేత్తలు సొంత రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకొంటారు. కానీ వారు కూడా అయిష్టంగానే పొరుగు రాష్ట్రానికి తరలిపోతున్నారు. దీనికి ఎవరు కారణం? రాజకీయాలను పరిశ్రమలకు కూడా వ్యాపింపజేసి పారిపోయేలా చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందేమో?
The fifth T20I between India and West Indies was washed out due to rain at…
Vijay Deverakonda’s Ranabaali is trying to maintain momentum at the box office after receiving mixed…