
“అంతా మంచే జరగాలని ఆశిద్దాం. ఈ కష్టకాలాన్ని ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉందాం,” అని జెఫ్ బెజోస్ అన్నారు. సుమారు 10 లక్షల కోట్లు విలువగల ఆస్తులు కలిగిన జెఫ్ బెజోస్ అంతటివ్యక్తి ఆర్ధిక మాంద్యం గురించి ఇంతగా ఆలోచిస్తున్నారంటే, ఐటి ఉద్యోగులు, సామాన్య ప్రజలు ఇంకెంత ఆలోచించాలి?
ఒకప్పుడు భారత్‌లో అందరూ తప్పనిసరిగా పొదుపు పాటించేవారు. అందుకే ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా తట్టుకొని నిలబడగలిగేవారు. కానీ ఇప్పుడు ఐటి కంపెనీలో ఉద్యోగాలు… లక్షల్లో ప్యాకేజీలు వస్తుండటంతో “జీవితాన్ని ఎంజాయ్ చేయాలి… విలాసంగా జీవించాలి…” అనే పాశ్చాత్య ధోరణి బాగా పెరిగిపోయింది.
ఉద్యోగం దొరకాగానే పెద్ద ఇల్లు, ఖరీదైన కారు లేదా బైకులు వాయిదాల పద్దతిలో కొనడం పరిపాటిగా మారింది. ఉద్యోగం పోయినప్పుడు ఆ వాయిదాలు చెల్లించలేక, ఆ దర్జా జీవితాన్ని వదులుకోలేక అవస్థలు పడుతున్నవారు కోకొల్లలు ఉన్నారు. ఇక సామాన్య ప్రజల విషయానికి వస్తే, ఇదివరకు ఎన్నడూ లభించని వస్తువులు, ఉత్పత్తులు ఇప్పుడు మార్కెట్లను ముంచెత్తుతుండటంతో వారు కూడా ఆ ఆకర్షణలో పడి ఖర్చుకి బాగా అలవాటు పడ్డారు. దసరా దీపావళి పండుగల సందర్భంగా అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సంస్థలు పోటాపోటీగా అమ్మకాలు చేసుకొని వేలకోట్లు లాభాలు ఆర్జించడమే ఇందుకు తాజా నిదర్శనం.
కానీ అటువంటి ఆఫర్లకు బుట్టలో పడకుండా వీలైనంత వరకు పొదుపు చేసుకొని రాబోయే ఆర్ధిక మాంద్యాన్ని ఎదుర్కోవడానికి అందరూ సిద్దంగా ఉండమని అమెజాన్ సంస్థ అధినేత జెఫ్ బెజోస్ స్వయంగా చెపుతున్నారు. కనుక అనవసరమైన షాపింగులకి, ఖర్చులకి దూరంగా ఉండటం చాలా మంచిది.
చివరిగా ఒక మాట: అమెజాన్ కంపెనీ కూడా సుమారు 10,000 మంది ఉద్యోగులను త్వరలోనే తొలగించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంటే వారూ ఈ ఖర్చుల బాధితులుగా మారబోతున్నారన్న మాట! కనుక అందరూ జెఫ్ బెజోస్ సలహా పాటించడం చాలా మంచిది.
Nani and Vijay Deverakonda are moving away from the romantic entertainers and emotional dramas that…
Dharshna Sripal turns up the charm in this glossy, mood fresh gallery that blends soft…