
మంత్రి అంబటి రాంబాబు తన పాండిత్యం ప్రదర్శిస్తూ తెలివిగా ‘కాపు సోదరులారా… ‘ అంటూ మొదలుపెట్టి, “పవన్ కళ్యాణ్ మాటలు నమ్మకండీ. ఆయన వెంబడి వెళ్తే మీరు కూడా బాబు పల్లకీ మోయకతప్పదూ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ స్వయంగా చంద్రబాబు నాయుడు పల్లకీ మోస్తూ ఆయనని సిఎం చేయాలని ఆరాటపడుతున్నాడు. ఒకవేళ ఇతర కులాలలో ఎవరైనా పవన్ కళ్యాణ్ సిఎం అవుతాడని భ్రమలో ఉంటే దాని నుంచి బయటపడండీ,” అంటూ వేడుకొన్నారు.
అంతకు ముందు అదే నోటితో “రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారో అందరూ కట్టకట్టుకొని రండి… 175 సీట్లలో పోటీ చేయండి. సింహం సింగిల్గానే వచ్చిన్నట్లు సిఎం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైసీపీ సింగిల్గానే వచ్చి మీ అందరినీ ఎదుర్కొంటుందని,” ప్రగల్భాలు పలికిన మంత్రి అంబటి రాంబాబు, చంద్రబాబు నాయుడితో పవన్ కళ్యాణ్ భేటీ కాగానే మీడియా ముందుకు వచ్చి రంకెలు వేయడం దేనికో?పవన్ కళ్యాణ్ వెంటవెళ్ళిపోవద్దని కాపులు, బీసీలు వేడుకోవడం దేనికో?అంటే టిడిపి, జనసేనలు కలిస్తే వచ్చే ఎన్నికలలో వైసీపీ ఓడిపోవడం ఖాయమనే భయం, ఆందోళన వలననే అని అర్దం అవుతోంది. ఒకవేళ వైసీపీ ఓడిపోతే, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కమ్మ సామాజిక వర్గం గురించి ఇంత నీచంగా మాట్లాడిన్నందుకు రాబోయే రోజుల్లో తన పరిస్థితి ఏమవుతుందనే ఆందోళనవలన కావచ్చు.
వైసీపీ నేతల భయాలను టిడిపి నేతలు కూడా బాగానే గుర్తించారు. అందుకే వారి ప్రేలాపలనలపై టిడిపి సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందిస్తూ, “చంద్రబాబు నాయుడు-పవన్ కళ్యాణ్ భేటీ అయితే వైసీపీ నేతలు ఫ్యాంటులు తడిసిపోతున్నాయి. ఇక నుంచి వారు డైపర్లు ధరించడం మంచిది,” అంటూ ఘాటుగా జవాబిచ్చారు.
టిడిపి ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ స్పందిస్తూ, “175 సీట్లు మేమే గెలుచుకొంటామని గొప్పలు చెప్పుకొంటున్న వైసీపీ నేతలకి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ భేటీ అయితే ఎందుకు ఇంత ఆందోళన చెందుతున్నారు?అంటే వారి మాటల మీద వారికే నమ్మకం లేదనే కదా?వచ్చే ఎన్నికలలో వైసీపీ ఓటమి ఖాయమని వారికి అర్దమైన్నట్లే ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ భేటీతో ఇంత ఆందోళన చెందుతున్నారు,” అని ఎద్దేవా చేశారు.
టిడిపి, జనసేనలు ఇకపై కలిసి పనిచేయాలని నిర్ణయించుకొన్నందున వైసీపీ నేతల కడుపుమంటలు నానాటికీ ఇంకా పెరుగుతాయే తప్ప చల్లారేవి కావు. ఏటా భోగీనాడు ఒక్కరోజే ప్రజలు చలిమంటలు వేసుకొంటారు. కానీ వైసీపీ నేతల కడుపు మంటలు ఎన్నికలలు పూర్తయ్యేవరకు రాష్ట్ర రాజకీయాలను వేడివేడిగా ఉంచబోతున్నాయి.
The fifth T20I between India and West Indies was washed out due to rain at…
Vijay Deverakonda’s Ranabaali is trying to maintain momentum at the box office after receiving mixed…