Telugu

ఈ ‘రాయుడు’కు టెంపర్ లేచింది!

ఓ సీనియర్ సిటిజన్ పై క్రికెటర్ అంబటి రాయుడు చేయి చేసుకున్న సంఘటనపై తోటి సీనియర్ సిటిజన్లు మండిపడుతున్నారు. హైదరాబాద్ లోని హబ్సిగూడ లో ఉన్న జెన్ పాక్ కాలనీలో అంబటి రాయుడు నివసిస్తుండగా, ఇదే ప్రాంతంలో నివసిస్తున్న సీనియర్ సిటిజన్లు గురువారం నాడు ఉదయం మార్నింగ్ వాక్ కి వెళ్లారు. ఇదే సమయంలో ఓ స్నేహితుడితో కలిసి అంబటి రాయుడు తన కారులో వేగంగా అటువైపు వెళ్లగా, ఆయన కారు ఓ సీనియర్ సిటిజన్ కు తగిలింది.

వెంటనే అప్రమత్తమైన తోటి సీనియర్ సిటిజన్లు ఈ విషయమై అంబటి రాయుడిని ప్రశ్నించారు. దీంతో ఆగ్రహించిన ఆయన మీ ఇష్టం వచ్చిన వారికి చెప్పుకోండని వారిని బెదిరించినట్టు తెలుస్తోంది. కాగా, బాధిత సీనియర్ సిటిజన్ కు గాయాలయ్యాయి. అంబటి రాయుడు, బాధిత సీనియర్ సిటిజన్ పరస్పరం తిట్టుకున్నారు. ఈ క్రమంలో ఆయనపై అంబటి రాయుడు చేయి చేసుకున్నాడు. గతంలో హర్భజన్ తో గొడవపడిన, దేశవాళీ క్రికెట్ లో కూడా ఒకరిపై చేయి చేసుకున్న సంఘటన ఉన్న విషయం తెలిసిందే.

ADVERTISEMENT
Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Devaraaya: Kichcha Sudeepa In A Powerful Historical Avatar

Kichcha Sudeepa needs no special introduction to the Telugu audiences. The actor’s next project has…

18 minutes ago

నెల్లూరుకి కృష్ణమ్మ, అనకాపల్లికి గోదావరి.. అభివృద్ధి కనిపిస్తోందా రాజా?

పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలు అనకాపల్లి జిల్లాలోని పాయకరావు పేటకు చేరుకున్నాయి. తమ ఊరుకి తరలివచ్చిన గోదావరి…

25 minutes ago