Telugu

టీజర్ టాక్ – కన్ ఫ్యూజన్ ‘కామెడీ’ వర్క్స్!

ఒక హీరోయిన్ చుట్టూ ఇద్దరు, ముగ్గురు పడడం, అందులో నుండి కామెడీని జనరేట్ చేసి, ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడం, ఇప్పటికీ చాలాసార్లు జరిగింది. అయితే ఎన్ని సార్లు వచ్చినప్పటికీ, సిల్వర్ స్క్రీన్ పై కామెడీ పండితే ప్రేక్షకులు ఇచ్చే రివార్డులతో చిత్ర యూనిట్ తడిసిముద్దవుతుంది. చూడబోతుంటే… ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన తాజా చిత్రం “అమీ తుమీ” కూడా ఆ కోవలోకే చేరే విధంగా కనపడుతుందని, లేటెస్ట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన టీజర్ చెప్పకనే చెప్తోంది.

ADVERTISEMENT

ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ తో ఆకర్షించిన ‘అమీ తుమీ’ చిత్ర యూనిట్, ఫస్ట్ టీజర్ తో మరో మెట్టు ఎదిగినట్టే చెప్పవచ్చు. ఇంద్రగంటి దర్శకత్వం వహించిన “అంతకు ముందు ఆ తర్వాత” సినిమాతో పరిచయమైన ఈషా హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో అవసరాల శ్రీనివాస్, అడవి శేషు, వెన్నెల కిషోర్ లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ముగ్గురిలో ఈషా ఎవరికి దక్కుతుందనే విధంగా కట్ చేసిన ఫస్ట్ టీజర్ లో ‘కన్ ఫ్యూజన్ కామెడీ’ వర్కౌట్ అయ్యేలా కనిపించింది. మరి ఆ టీజర్ పై మీరూ ఓ లుక్కేయండి..!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Fauzi Is Finally Ready to Break Its Silence

Prabhas fans may finally start getting more updates about Fauzi from this month. Mythri Naveen…

45 minutes ago

Hyd’s Legendary Biryani Seized: Big News Ahead?

After the arrival of the Revanth Reddy government in Telangana, the food safety authorities have…

1 hour ago