
టీడీపీ ఎంపీలు సభ ముగిశాక అరుణ్ జైట్లీ ని కలిశారు. తాను చెయ్యగలిగింది అంతా చేశా అని, ఇంకా ఏమైనా అవసరం అనుకుంటే బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తో మాట్లాడుకుని ఆయనతో ఒక నోట్ రాయించుకుని రావాలని చెప్పారట. అసలు అమిత్ షా ఎవరు ఏపీకి ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదో డిసైడ్ చెయ్యడానికి?
అమిత్ షా ఒక రాజ్యాంగ వ్యతిరేక శక్తిగా మారి ప్రభుత్వాన్ని నడుపుతున్నారా? అమిత్ షా సహజంగానే బీజేపీ రాజకీయ ప్రయోజనాల బట్టే నిర్ణయాలు తీసుకుంటారు. కాంగ్రెస్ కంటే భిన్నం అని చెప్పుకునే మోడీ దీనికి ఏం సమాధానం చెప్పుకుంటారో? సాక్ష్యాత్తు ఆర్ధిక మంత్రి సైతం రబ్బర్ స్టాంప్ అయితే దేశానికీ ఏమి న్యాయం చేస్తారు?
మరోవైపు నిన్న రాజ్యసభ లాబీలో సుజనా చౌదరి అరుణ్ జైట్లీతో వాగ్వాదానికి దిగారు. రెండుసార్లు ప్రకటనలు చేసినా ఎందుకు సంతృప్తి లేదని జైట్లీ ప్రశ్నించారు. దీనికి కేంద్ర మంత్రి సుజనా చౌదరి ప్రతిస్పందిస్తూ ‘డొల్ల ప్రకటనలతో ప్రజలను మోసం చేయలేరు. పార్టీలు ఉంటాయి. పోతాయి. కానీ, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలి. పార్టీలకు విలువ ఇవ్వాలి.. సంఖ్యాబలానికి కాదు’ అంటూ వ్యాఖ్యానించారు. ఈ వాదనతో జైట్లీ అక్కడి నుంచి మౌనంగా నిష్క్రమించారు.
Prabhas has reached a point where the problem is no longer finding big films. It…
For the past few years, Suriya and Jyothika’s Mumbai connection has been a talking point…