‘పనామా’పై మండిపడ్డ లెజెండరీ అమితాబ్!

amitabh bachchan panama upset serious‘పనామా’ పేపర్స్ సృష్టించిన సంచలనంలో భాగంగా తొలి జాబితాలో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ ఆల్ టైం లెజెండరీ నటుడు బిగ్ బీ అమితాబ్ పేరు రావడం సర్వత్రా సంచలనమైంది. అలాగే అమితాబ్ కోడలు ఐశ్వర్యరాయ్ పేరు కూడా వెల్లడి కాగా, ఐశ్వర్య కొద్ది గంటలలోనే ఈ ఆరోపణలపై స్పందించి, పనామా ఆరోపణలను ఖండించింది. కాస్త సమయం తీసుకున్నప్పటికీ బిగ్ బీ కూడా ‘పనామా’పై మండిపడ్డారు.

పనామా ఆరోపిస్తున్నట్లు ‘సీ బల్క్ షిప్పింగ్ కంపెనీ లిమిటెడ్’తో తనకు ఎలాంటి సంబంధం లేదని, అసలు అలాంటి కంపెనీలలో తాను ఇప్పటివరకు డైరెక్టర్ గా లేనని, ఇండియాలో తాను సంపాదించిన ప్రతి రూపాయికి ఖర్చు చేసానని, అలాగే విదేశాలలో ఖర్చు పెట్టే మొత్తానికి కూడా నేను ఇండియాలో పన్నులు కట్టి మాత్రమే ఖర్చు చేసేవాడినని, తన పేరును దుర్వినియోగం చేసారని… ఓ జాతీయ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఆవేదనను వెలిబుచ్చారు.

ADVERTISEMENT

నిజానికి ఓ మూడు రోజుల ముందే తన జీవితాన్ని కుదిపేసిన ‘భోఫోర్స్’ ఉదంతంపై బిగ్ బీ స్పందిస్తూ… తన ప్రమేయం లేకపోయినా అందరూ తనను దొంగ మాదిరి చూసేవారని ఆవేదన వెలిబుచ్చారు. తన జీవితంలో అత్యంత దుర్భర క్షణాలుగా వాటిని అభివర్ణించిన అమితాబ్ కు ‘పనామా’ ఆరోపణలు షాక్ ఇచ్చినట్లయ్యింది.

ADVERTISEMENT
Latest Stories