రోజా మేకప్… వైసీపీ పేకప్… జగన్ లాకప్..!

సంచలన ప్రకటనలకు వేదికగా నిలిచే ఆనం వివేకానందరెడ్డి వైసీపీ పార్టీ అధినేత జగన్ మరియు ఆ పార్టీ నగరి నియోజకవర్గపు ఎమ్మెల్యే రోజాపై తీవ్ర పదజాలంతో కూడిన వ్యాఖ్యలు చేసారు. “మగతనం లేక, రోషం లేక, జబర్దస్త్ రోజాను జబర్దస్త్ గా తెలుగుదేశం మీదకు వదులుతున్నారు. ఈ జబర్దస్త్ రోజా అయితే జబ్బ చరిచి, లేడీ బాస్ లాగా, మా పైపైకి వస్తుందని భావించి, జగన్ మోహన్ రెడ్డి గారు రోజాను వదిలారని విమర్శలు గుప్పించారు. రాజకీయాల్లో వెకిలి చేష్టలు సరికాదమ్మా… నీవు జబర్దస్త్ లో చేసేటటువంటి వేషాలు కాదు, రాజకీయాలంటే..!” అంటూ హితవు పలికారు.

ఇక్కడి వరకు కాస్త స్థిమితంగా చెప్పిన ఆనం, ఆ తర్వాత ఒక స్థాయిలో రోజాపై తీవ్ర పదజాలంతో స్పందించారు. “గతంలో సినిమాల్లో రాణించావు. ఇప్పుడు సినిమాలు లేవు. టీవీలకే పరిమితమయ్యావు. రాబోయే రోజుల్లో జగన్ ప్రోగ్రాముల్లో రికార్డింగ్ డ్యాన్స్ లకే పరిమితమవుతావ్, వైసీపీ పతనానికి నీ ఒక్క పాదమే చాలమ్మా రోజమ్మా, రోజాకు మేకప్ లు… వైసీపీకి పేకప్ లు…. జగన్ కు లాకప్ లు తప్పవు, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్ష కోట్ల రూపాయల అక్రమార్జనకు పాల్పడ్డ జగన్ ను చూసి లోకేశ్ నేర్చుకోవాలా?” అంటూ సెటైర్లు, పంచ్ లతో కూడిన విమర్శలు చేసారు ఆనం వివేకానందరెడ్డి.

ADVERTISEMENT

రోజా వెకిలి చేష్టలను సరిచేసుకోవాలంటూ ఆనం వ్యక్తపరిచిన భావాలను గతంలో రాజకీయ విశ్లేషకులు కూడా వ్యక్తపరిచారు. అసెంబ్లీ వేదికగా రోజా చేసిన చేష్టలు రాజకీయ వర్గాలను నివ్వెరపరిచాయి. ముఖ కవలికలతో, చేతులు, నాలుకతో రోజా వ్యక్తపరిచిన భావాలు చీదరింపుకు గురైన విషయం తెలిసిందే. ఆనం మాటలు కాస్త కటువుగా వున్నా, భావాలు మాత్రం అర్ధరహితంగానే ఉంటాయన్నది విశ్లేషకుల మాట.

Share
Saumya

Saumya is a passionate Telugu movie addict and an avid binge watcher of OTT platforms, covering Travel, Bollywood, Tamil, Kannada, Malayalam, and international cinema. With a decade of experience at M9 News, Saumya br…

Published by

Recent Posts

BB10: Who Is Strong & Who Gets Sympathy?

The tenth edition of the Bigg Boss Telugu TV show is live. Nagarjuna Akkineni returned…

53 minutes ago

Varanasi AP/TG Business: Too Massive a Deal for Mahesh?

Mahesh Babu’s Varanasi, directed by SS Rajamouli, is already one of the biggest films in…

4 hours ago