Telugu

వైరల్ అవుతోన్న పోస్టర్… కారణం ఉంది..!

‘భలే మంచి రోజు’ వంటి సూపర్ హిట్ తర్వాత, అదే నిర్మాణ సంస్థ నుండి వస్తున్న “ఆనందో బ్రహ్మా” సినిమా ‘ఫస్ట్ లుక్’ పోస్టర్ మరియు ‘మోషన్ పిక్చర్’తో వీక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ సాధించాయి. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ చిత్ర యూనిట్ తాజాగా మరో పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఆగష్టు 18వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నాము అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పోస్టర్, ఓ బాలీవుడ్ సినిమాకు కాపీ పోస్టర్ లా దింపేయడంతో, అది కాస్త వైరల్ గా మారింది.

2013లో ఇమ్రాన్ హష్మి, హుమా కురెశి, కొంకణ సేన్ శర్మ, కల్కి కోయేచిన్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన “ఏక్ తి దాయన్” సినిమా పోస్టర్ ను యాజిటిజ్ గా కాపీ చేస్తూ రూపొందించిన “ఆనందో బ్రహ్మా” పోస్టర్ పై నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు. ఇప్పటివరకు “ఆనందో బ్రహ్మా” సినిమాపై ప్రేక్షకులలో పాజిటివ్ వైబ్స్ ఉండగా, తాజాగా వెలుగులోకి వచ్చిన కాపీ పోస్టర్ తో, కేవలం పోస్టర్ ఒక్కటే కాపీనా? లేక సినిమా కూడానా? అన్న సందేహాలు సగటు సినీ ప్రేక్షకులలో వ్యక్తమవుతున్నాయి.

ADVERTISEMENT
Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Irumudi Is A Miracle In Mythri’s Journey: Producers

The Irumudi team had plenty to celebrate as the film’s extraordinary theatrical run continues, with the movie…

21 seconds ago

సీఎం హోదాలోనే అసెంబ్లీ కి…

ఈ మధ్య రాజకీయాలలో అధికారంలో ఉంటే తప్ప అసెంబ్లీ కి వెళ్ళేది లేదు అనే ఒక వింత సంస్కృతీ మొదలయ్యిందనే…

6 minutes ago