
ఆ జాబితాలో సాయిపల్లవి నటించిన “హేయ్ పిల్లగాడా” సినిమా టీజర్ విడుదల కాగా, తాజాగా అనుపమ పరమేశ్వరన్ నటించిన ఓ సినిమాను తెలుగులో “అందమైన జీవితం” పేరుతో తీసుకువస్తున్నారు. ఈ రెండు సినిమాలలో హీరో దుల్కర్ సల్మాన్ కావడం విశేషం. అయితే “అందమైన జీవితం” సినిమా విషయానికి వస్తే, ప్రమోషన్ లో భాగంగా ఇటీవల ఓ రెండు ట్రైలర్స్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
ఈ రెండు ట్రైలర్స్ ఎలా ఉన్నాయి అన్నది పక్కన పెడితే, తాము టైటిల్ గా భావించిన “అందమైన జీవితం” అన్న దానికి ఓ లోగో కూడా లేకుండా విడుదల చేయడం విస్మయానికి గురి చేసే అంశం. కేవలం ఓ టైటిల్ ను పెట్టేసి టీవీ సీరియల్ కంటే దారుణంగా ఈ ట్రైలర్ లో టైటిల్స్ కనపడుతున్నాయి. ఈ మాత్రం దానికి సినిమాకు డబ్ చేయడం ఎందుకు అనుకోవడం వీక్షకుల వంతవుతోంది. క్వాలిటీ లేని సినిమాలను అగ్ర హీరోలు చేస్తుంటేనే తిరస్కరిస్తున్న రోజులలో, ఇలాంటి బొమ్మలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారా?
Pawan Kalyan was one of the individuals to firmly stand by the Chandrababu Naidu family…
Ravi Teja took the box office by storm in August. Irumudi came without the huge…