Telugu

బీజేపీ నేతలు వచ్చే ఫలితాలు చూసైన సిగ్గు పెడతారేమో చూడాలి

ఒకప్పుడు ప్రముఖ సెఫాలజిస్ట్ గా పని చేసి ఆ తరువాత బీజేపీలో చేరి రాజ్యసభ ఎంపీగా మారిన జీవీఎల్‌ నరసింహరావు ఎన్నికల్లో ఓడిపోతున్న విషయం చంద్రబాబుకు అర్థమైందని, తన ఓటమిని ఎన్నికల కమీషన్ మీద నెట్టే వేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూలేని విధంగా ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్నరని చెప్పారు. చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని.. చంద్రబాబు దారుణంగా ఓడిపోబోతున్నారని జోస్యం చెప్పారు.

పెద్ద ఎత్తున ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత స్పష్టమవుతోందన్నారు. పోలింగ్ శాతం పెరగడం ద్వారా ప్రజలు మార్పును కోరుకుంటున్నారన్న విషయం అర్థమవుతోందన్నారు. ఓటింగు శాతం పెరిగితే ప్రభుత్వ వ్యతిరేకత అనేది బుజు పట్టిన సిద్ధమని నరసింహారావు వంటి సెఫాలజిస్ట్ తెలియకపోవడం విశేషం. ఇటీవలే తెలంగాణ ఎన్నికలలో కూడా ఇటువంటి లెక్కలే వెయ్యగా తెరాస మళ్ళీ భారీ ఆధిక్యంతో అధికారంలోకి వచ్చింది.

ADVERTISEMENT

ఇవన్నీ పక్కన పెడితే బీజేపీ పెర్ఫార్మన్స్ గురించి జీవీఎల్‌ నరసింహరావు మాట్లాడకపోవడం విశేషం. ఆంధ్రప్రదేశ్ లో కనీసం ఖాతా తెరిచే పరిస్థితి లేదు ఆ పార్టీకి, సీట్ల సంగతి పక్కన పెడితే కనీసం గుప్పెడు సీట్లలో డిపాజిట్లు కూడా దక్కడం కష్టం. దాని గురించి బాధ లేదు ఎంతసేపు చంద్రబాబు ఓడిపోవాలి… ఓడిపోవాలి… ఇక ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ ఎదగడం లేదు అంటే ఎందుకు ఎదుగుతుంది? మే 23 తరువాత వారికి వచ్చే ఫలితాలు చూసైన సిగ్గు పెడతారేమో చూడాలి

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

Yash’s Ramayana Connection Is Bigger Than Ravana

Yash is preparing to face audiences as Ravana in Ramayana, but his role in the…

14 minutes ago

ఏపీ టూరిజం స్పాట్ గా సూర్యలంక బీచ్…?

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కొలమానాలు అంటే ఒకటి పారిశ్రామిక ప్రగతి మరొకటి ఆర్థిక పురోగతి. అయితే అందులో రెండవదైన ఆర్థిక పురోగతికి…

32 minutes ago