Telugu

ఏపీ టూరిజం స్పాట్ గా సూర్యలంక బీచ్…?

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కొలమానాలు అంటే ఒకటి పారిశ్రామిక ప్రగతి మరొకటి ఆర్థిక పురోగతి. అయితే అందులో రెండవదైన ఆర్థిక పురోగతికి మంచి తోడ్పాటునిచ్చే అంశం టూరిజం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు గత కొన్నేళ్లుగా ఈ టూరిజం పై అంతగా శ్రద్ద పెట్టలేదనే చెప్పాలి.

పేరు కి మాత్రం ఒక మంత్రి హోదా పని మాత్రం శూన్యం అనేట్టుగా టూరిజం శాఖ పనులు కొనసాగేవి. ఏపీలో పర్యటకులను ఆకర్షించేందుకు అనేకమైన ప్రాంతాలు అందుబాటులో ఉన్నాయి. అందులో ఆధ్యాత్మిక ప్రాంతాలు, విహార ప్రాంతాలు, ఆహ్లాదకరమైన అనుభూతినిచ్చే ప్లేస్ లు…ఇలా అనేక ప్రాంతాలు ఏపీ ని టూరిజం స్పాట్ గా నిలబెట్టగలవు. కానీ అందుకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు అత్యంత కీలకం.

ADVERTISEMENT

కాణిపాకం వినాయకుడు, తిరుమల శ్రీవారి పుణ్యక్షేత్రం, శ్రీశైలం మల్లన్న, సింహాచలం అప్పన్న, విజయవాడ దుర్గమ్మ, పిఠాపురం దత్తాత్రేయుడు, మంగళగిరి పానకాల స్వామి, మోపిదేవి సుబ్రమణ్య దేవాలయం…ఇలా భక్తులు మెచ్చే అనేక పుణ్యక్షేత్రాలు ఆధ్యాత్మిక ప్రాంతాలుగా వెలుగొందుతున్నాయి.

అలాగే అరకు, పాడేరు, లంబసింగి, మారేడుమిల్లి, కొత్తపల్లి జలపాతం, తలకోన జలపాతం, పాపికొండలు, అనంతగిరి హిల్స్ వంటి ప్రాంతాలు ప్రకృతి ప్రేమికుల మనసు దోచుకుంటున్నాయి. ఇక విశాఖలో ఆర్కే బీచ్, రుషికొండ బీచ్, యారాడ, భీమిలి…ఇలా విశాఖనగరం బీచ్ల నిలయంగా కొలువుతీరుతుంది.

అలాగే ఇటు మచిలీపట్టణం కూడా స్థానికంగా పర్యాటకప్రాంతంగా మారుతుంది. ఇక ఏపీలోని బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ ప్రస్తుతం ఏపీ టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఏపీ టూరిజం చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా సూర్యలంక బీచ్ అభివృద్ధి చెందుతుంది.

ఒకప్పుడు బెస్ట్ బీచ్ ఎక్స్ పీరియన్స్ అంటే గోవా బెస్ట్ ప్లేస్ గా పేరుపొందింది. కానీ ఇక నుంచి గోవా తరహా ఆహ్లాదాన్ని అందుకోవడానికి అన్ని వందల కిలోమీటర్లు ప్రయాణించాల్సిన అవసరం లేదని, బాపట్ల సూర్యలంక బీచ్ ను గోవా బీచ్ల మాదిరి అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులో ఉంచుతామంటూ నాడు సీఎం బాబు చేసిన ప్రకటనలు నేడు ఆచరణలో కనిపిస్తున్నాయి అంటున్నారు బీచ్ ని సందర్శించేందుకు వస్తున్న పర్యాటకులు.

బీచ్ సమీపంలో వెలుస్తున్న రిసార్ట్స్ పర్యాటకుల మనసు దోచుకుంటున్నాయి. ఒక్కో రిసార్ట్ ఒక్కో థీమ్ తో పర్యటకులను ఆకర్షిస్తూ ముందుకెళుతున్నాయి. కూటమి ప్రభుత్వ రాకతో సూర్యలంక బీచ్ రూపురేఖలు పూర్తిగా మారిపోతున్నాయి.

ఒకటిరెండు రోజులు ఫ్యామిలీతో సరదగా చిల్ అవ్వడానికి అటు హైద్రాబాద్ తోపాటుగా పరిసర ప్రాంతాల ప్రజలు సైతం పెద్ద ఎత్తున సూర్యలంక బీచ్ ను సందర్శిస్తున్నారు. ఇటు ఏపీలోనూ వివిధ ప్రాంతాల నుంచి ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో సరదాగా సమయం గడిపేందుకు సూర్యలంక వైపు చూస్తున్నారు.

గతంతో పోలిస్తే ఇక్కడ పర్యటకుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. సోషల్ మీడియా వేదికలలో కూడా సూర్యలంక బీచ్ ట్రేండింగ్ లో ఉంటుంది. ఇలా ఒకప్పుడు టూరిజం కింద అంతమాత్రంగా ఉండే బాపట్ల ఇప్పుడు సూర్యలంక బీచ్ అభివృద్ధి పుణ్యమా అని ఏపీ టూరిజం స్పాట్ గా మారిపోయింది.

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

5 Yrs For 1 Film: Will Rajamouli Kill His Dream!

The kind of extensive production activities that happen with Rajamouli’s films are far superior to…

16 minutes ago

Fire Near Parliament: Thick Smoke Rises From North Block

A fire broke out at North Block in New Delhi on Monday, October 26, sending…

31 minutes ago