
ఆయా గ్యాంగ్‌లపై మూడు రోజులుగా నిఘా పెట్టిన పోలీసులు, దాదాపు 57 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో అన్ని పార్టీల నేతల ప్రమేయమున్నట్లు అధికారుల వర్గాల సమాచారం. ప్రాంతాలను పంచుకుని ఈ దందా సాగిస్తున్నారట. ఇప్పటికే నిందితులను పట్టుకునేందుకు పోలీసులు బృందాలుగా ఏర్పడి దాడులు చేస్తున్నాయి. పోలీసులు రంగంలోకి దిగడంతో కాల్‌మనీ వ్యాపారులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. ఈ వేడి తగ్గిన తర్వాత రావచ్చని బయటకు రావచ్చని అంచనా వేసుకుంటున్నారు. అలాగే విశాఖ, తూర్పుగోదావరి, కడప, నెల్లూరు జిల్లాల్లో కాల్‌మనీ గ్యాంగ్ ముఠా సభ్యులను అరెస్ట్ చేశారు. ఒక్కో ఏరియాలో ఒక్కోపేరు మీద సాగుతోన్న ఈ యవ్వారంలో ఎంతమంది నేతలు బయట పడతారో చూడాలి.
ఇదెలా ఉంటే, కాల్‌మనీ వ్యవహారంపై ఇంటాబయటా ఆందోళనలు తీవ్రమవుతున్నాయి. మహిళల జీవితాలతో ఆడుకుంటున్న కాల్‌మనీ ఉదంతంపై పూర్తి వివరాలు అందజేయాలంటూ ఏపీ చీఫ్ సెక్రటరీ, డీజీపీకి జాతీయ మానవ హక్కుల సంఘం- ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు జారీ చేసింది. ఆర్థిక అక్రమాలు, మహిళలతో బలవంతంగా నిర్వహించిన సెక్స్ రాకెట్‌ను అడ్డుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో వెల్లడిస్తూ రెండు వారాల్లోగా తెలియజేయాలని పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని కేవీపీ, సుబ్బిరామిరెడ్డి, జైరాంరమేష్, జేడీ శీలం, రఘువీరారెడ్డిలతో కూడిన ఓ బృందం ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఛైర్మన్ జస్టిస్ సిరియక్ జోసెఫ్‌ను మంగళవారం కలిసింది. ఈ వ్యవహారంపై కొద్ది రోజులుగా న్యూస్ పేపర్లలో వస్తున్న కథనాలతో పాటు సంబంధిత వివరాలను నేతలు అందజేశారు. దీనిపై స్పందించిన ఛైర్మన్.. ఎన్‌హెచ్‌ఆర్‌సీ బృందం ఏపీ స్వయంగా పర్యటించి వివరాలు సేకరిస్తుందని హామీ ఇచ్చారు.
Ram Gopal Varma has once again raised a disturbing question about AI. And this time,…
రాజకీయాలలో నానాటికి విలువలు దిగజారుతున్నాయని ఎప్పటికప్పుడు రాజకీయ నాయకులు తమ చేష్టలతో, తమ చర్యలతో నిరూపిస్తూనే వస్తున్నారు. నిన్న మొన్నటి…