
1. విజయవాడలో సితార సెంటర్ వద్ద విద్యాధరపురంలో 1,850 చదరపు గజాలను వైసీపీకి కేటాయించింది.
2. అనకాపల్లి జిల్లా రాజుపాలెం గ్రామంలోని సర్వే నంబర్ 75/3లో 1.75 ఎకరాల భూమిని, విశాఖపట్నంలో జాతీయ రహదారి పక్కనే ఉన్న భూమిలో కాపు సామాజిక భవనం కోసం కేటాయించిన భూమిలో కొంత భాగాన్ని వైసీపీ కార్యాలయం కోసం ప్రభుత్వం అప్పగించింది.
3. కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం పట్టణంలో జన్నుపల్లిలో సర్వే నంబర్: 48/2లో ఒక ఎకరం భూమిని వైసీపీ కార్యాలయం కోసం కేటాయించగా గ్రామ పంచాయతీ దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ తీర్మానం చేసింది. పట్టణంలో కలెక్టరేట్ కార్యాలయం కోసం భూమి దొరకడం లేదని చెప్పిన అధికారులే వైసీపీ కార్యాలయం కోసం కోట్లు విలువచేసే ఈ భూమిని కేటాయించారు.
ఇంకా కడప, పల్నాడు, రేణిగుంట, పుట్టపర్తి, నరసారావుపేటలో వందల కోట్లు విలువచేసే ప్రభుత్వ భూములను వైసీపీ కార్యాలయాలకు కేటాయించుకొంది. ఆ భవనాలకు భూములు కేటాయించుకోవడం వరకే ఆగుతుందా లేదా వాటి నిర్మాణాలకి అయ్యే ఖర్చుని కూడా ప్రభుత్వమే ఏదో పద్దులో చెల్లించేస్తుందో? ప్రభుత్వం ఆస్తులకు, ఆదాయానికి ధర్మకర్తగా ఉంటూ వాటిని కాపాడాల్సి ఉండగా, ఈవిదంగా తన సొంత పార్టీకి అప్పనంగా భూములు కేటాయించుకోవడం అధికార దుర్వినియోగానికి పాల్పడటమే అవుతుంది. త్వరలోనే దీనిపై హైకోర్టులో పిటిషన్లు పడకమానవు.. అప్పుడు మొట్టికాయలు తప్పదు.
The fifth T20I between India and West Indies was washed out due to rain at…
Vijay Deverakonda’s Ranabaali is trying to maintain momentum at the box office after receiving mixed…