
ఋషికొండ తవ్వకాలతో ఎంత నష్టం జరిగిందో తెలుసుకొనేందుకు నిష్పక్షపాతంగా, సాధికార నివేదిక ఇవ్వగల నిపుణులతో కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉండగా ప్రభుత్వం కనుసన్నలలో పనిచేసే అధికారులతో కమిటీ వేసింది. దానిపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేయడంతో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ కేంద్ర ప్రభుత్వ ఇంజనీర్లు, శాస్త్రవేత్తలతో కూడిన మరో కమిటీని ఏర్పాటు చేసింది.
కేంద్ర ప్రభుత్వం తరపున డిప్యూటీ సొలిసిటర్ జనరల్ ఎన్. హరినాథ్ గురువారం హైకోర్టుకి సమర్పించిన మెమో ప్రకారం ఆ కమిటీలో సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీలో ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వివిఎస్.శర్మ, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ శాస్త్రేవేత్త డి.సౌమ్య, నేషనల్ సెంటర్ ఫర్ సస్టెయినబుల్ కోస్టల్ మేనేజెమెంట్ శాస్త్రవేత్త డాక్టర్ మాణిక్ మహాపాత్ర సభ్యులుగా ఉన్నారు.
వీరు ఋషికొండ తవ్వకాలు, అక్కడ నిర్మించిన కట్టడాలపై అధ్యయనం చేసి నాలుగు వారాలలోగా నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఆ నివేదిక ఆధారంగా తుది తీర్పు వెలువరిస్తామని తెలియాయజేస్తూ ఈ కేసు తదుపరి విచారణని మార్చి 16కి వాయిదా వేసింది. ఋషికొండ తవ్వకాలు, నిర్మాణాలపై పిటిషనర్లలో ఎవరికైనా అభ్యంతరాలు లేదా సమాచారం ఇవ్వాలనుకొంటే ఈ కేంద్ర ప్రభుత్వ కమిటీకి అందజేయాలని హైకోర్టు సూచించింది.
#Epic Review: From 90s Magic to Epic Disappointment! Epic starts with 90s nostalgia but soon…
BOTTOM LINE Slow, Sincere Manhunt Drama PLATFORM ZEE5 RUNTIME 2Hrs 30Mins What Is the Show…