
నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో అనేక పాఠశాలలలో అదనపు తరగతి గదులు నిర్మించి వాటిలో ఫ్యానులు, లైట్లు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అలాగే పాఠశాలల విలీనంతో కొన్ని పాఠశాలలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. కనుక పాఠశాలల విద్యుత్ బిల్లులు, మరుగుదొడ్లు శుభ్రం చేయించడం, వాటి కోసం చీపురుకట్టలు, ఫినాయిల్ వగైరా కొనుగోలు చేయడం, విరిగిన, లీక్ అవుతున్న కుళాయిలు మార్చుతుండటం, వెలగని లైట్లు, తిరగని ఫ్యానుల మరమత్తులు లేదా కొత్తవి కొనుగోలు చేస్తుండటం, వాటి బిగింపు ఖర్చులు, ప్రపంచంతో పోటీ పడేందుకు ఏర్పాటు చేసిన కంప్యూటర్ క్లాసులలో వాటి మరమత్తుల ఖర్చులు వగైరా వగైరాలు ఉంటాయి. ఇవన్నీ కాక సుద్దముక్కలు, అటెండన్స్ రిజిస్టర్లు, పుస్తకాలు, తెల్లకాగితాలు వంటి స్టేషనరీ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. మధ్యాహ్నం భోజన పధకం మరో పెద్ద కధ. కనుక దాని గురించి వేరేగా చెప్పుకోవలసిందే.
వీటన్నిటికి ప్రభుత్వం నెలనెలా నిధులు విడుదల చేయాల్సి ఉంటుంది. 2019-2020 వరకు వీటి కోసం హెడ్ మాస్టర్ అధికారిక బ్యాంక్ ఖాతాలోనే ప్రభుత్వం నేరుగా డబ్బు జమా చేసేది. కానీ 2020-21 నుంచి పీడీ ఖాతాల ద్వారా చెల్లింపులు చేస్తోంది. దాని కోసం ముందుగా హెడ్ మాస్టర్లు బిల్లులు పెట్టుకోవాలి. అంతకంటే ముందు విద్యార్థుల హాజరు డైలీ రికార్డులు, మరుగుదొడ్ల నిర్వహణకు సంబందించి ప్రతీరోజూ వాట్సప్ ఫోటోలు టంచను పంపించి ఉండాలి. వాటితో బిల్లులను సరిపోల్చుకొని వాటితో అధికారులు తృప్తి చెందితే బిల్లులు ఆమోదిస్తారు. తర్వాత విద్యాశాఖ నుంచి సొమ్ము విడుదలవుతుంది. ఈ సంక్లిష్టత కారణంగా కొన్నిసార్లు బిల్లులు సకాలంలో ఆమోదం పొందవు లేదా కొర్రీలు పడి వెనక్కు తిరిగి వచ్చేస్తుంటాయి. అప్పుడు హెడ్ మాస్టర్లు అధికార్ల చుట్టూ తిరిగి వివరణలు ఇచ్చుకొని బిల్లులు పాస్ చేయించుకోవలసి ఉంటుంది. అంతవరకు పాఠశాల నిర్వహణ పనులు ఆపలేరు కనుక అప్పులు, చందాలు తప్పవు. విద్యావిధానంలో పెను మార్పులు తెచ్చేస్తున్నప్పుడు ఇటువంటి కొన్ని చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొక తప్పదని విద్యాశాఖ మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ ఎప్పుడో చెప్పేరు. కనుక దేశ భవిష్యత్ కోసం హెడ్ మాస్టర్లు, ఉపాధ్యాయులు కొంత సర్దుకుపోక తప్పదు… కొన్ని త్యాగాలు చేయక తప్పదు.
Misha Narang gives casual dressing a stylish little shakeup in this breezy photoshoot. An oversized…
Vishwaksen’s #CULT is gearing up for a worldwide theatrical release on October 30. The project…