
“దక్షిణాఫ్రికా దేశాన్ని చూస్తే వారికి మూడు రాజధానులుంటాయి. బహుశా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు వస్తాయేమో. మూడు రాజధానులు రావలసిన అవసరం కనిపిస్తోంది” అని జగన్ అన్నారు. దేశంలో ఏ రాష్ట్రానికి మూడు రాజధానులు లేవు. అయితే ఈ సంబరం అక్కడితో ఆగడం లేదు.
అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో మరి కొన్ని డిమాండ్లు తెర మీదకు తెస్తున్నారు. తిరుపతిని ఆధ్యాత్మిక రాజధానిగా ప్రకటించాలని రాయలసీమ పోరాట సమితి డిమాండ్ చేసింది. ఆధ్యాత్మిక రాజధానిగా తిరుపతిని ప్రకటించకపోతే ప్రత్యేక రాయలసీమ ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించింది.
అదేదో సంఘం రాజమండ్రిని సాంస్కృతిక రాజధానిగా ప్రకటించమని డిమాండ్ చేస్తుంది. ఈ లెక్కన మూడు రాజధానులతో ఆగిపోకుండా పదమూడు జిల్లాలకు సరిపడా పదమూడు రాజధానుల డిమాండ్ మొదలవుతుందేమో?
The Telugu film industry was left shocked after a tragic road accident in Hyderabad claimed…
Rohith Nara has always been recognized for his penchant for unique scripts and diverse character…