
దాదాపుగా మూడు గంటలుగా బుద్ధా వెంకన్న నివాసం వద్ద ఉన్న పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బుద్ధా, “తాను చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను, తానేమి వెనక్కి తగ్గే వ్యక్తిని కాదని, అయితే తనపై ఎటువంటి కేసులు పెడతారో చూస్తానని” అన్నారు.
తాను అన్న దానికి కేసులు పెడితే, గత రెండేళ్లుగా ‘కొడాలి నాని అండ్ కో’ అన్న దానికి ఎందుకు కేసులు పెట్టరని, అదేంటో నేను తేల్చుకుంటానని ఈ సందర్భంగా తెలిపారు. ఎన్టీఆర్ పేరు చెప్పి ఎన్టీఆర్ కుటుంబాన్ని రాజకీయంగా కాకుండా వ్యక్తిగత విమర్శలు చేస్తున్న కొడాలి నాని అంత తోపు కాదనే విషయాన్ని తాను చెప్పానని అన్నారు.
సెక్షన్ 41 క్రింద నోటీసులు ఇస్తే వస్తానని పోలీసులకు చెప్పానని, అయితే ఏ సెక్షన్ క్రింద కూడా తనకు నోటీసులు ఇవ్వలేదని, అనేక వాదోపవాదాల నడుమ నేను స్టేషన్ కు వస్తానని చెప్పానని, అయితే వారు ఎందుకు తీసుకెళ్తున్నారో తనకు తెలియదని, స్టేషన్ కు తీసుకువెళ్ళాక రిమాండ్ కు పంపిస్తారో, అడిగి వదిలేస్తారో కూడా తెలియదని బుద్ధా వెంకన్న చెప్పారు.
Karthi's highly anticipated sequel Sardar 2, directed by PS Mithran, was released in theatres on…
Following the back to back failures of Thangalaan and Veera Dheera Sooran, actor Vikram took…