
అధికారం చేపట్టిన నాటి నుండి ఇప్పటివరకు అనేక సందర్భాలలో టంగ్ స్లిప్ అయిన వైసీపీ వర్గం, తాజాగా జగన్ పుట్టినరోజు నాడు అభిమానగణం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఇలాగే టంగ్ స్లిప్ అయ్యారని సోషల్ మీడియాలో ఓ వీడియో చక్కర్లు కొడుతోంది.
‘అవినీతి పరిపాలన అందించగలిగిన ఏకైక నాయకుడు భారతదేశ చరిత్రలో ఎవరైనా ఉన్నారంటే, అది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు’ అంటూ వైసీపీ నేత పలికారు. బహుశా ఇది అర్ధమైందో లేదో గానీ, పక్కనే ఉన్న పార్టీ వర్గమంతా ఈ వ్యాఖ్యలకు చప్పట్లతో అభివాదాలు పలికారు.
నిజంగా సదరు నాయకుడు ఆ వ్యాఖ్యలు చేసారో లేదో గానీ, సోషల్ మీడియాలో అయితే ఈ క్లిప్ వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ గారు స్లిప్ అయిన మరో వీడియో కూడా సోషల్ మీడియాలో హంగామా చేస్తోంది.
కబడ్డీ ఆడే క్రమంలో కూతకు వెళ్లి తిరిగి వచ్చిన స్పీకర్ గారు, పరిగెత్తుకుని వచ్చే ఊపును ఆపుకోలేక ముందుకు పడిపోయారు. ఒక్కసారిగా తమ్మినేని గారు పడిపోవడంతో అవాక్కయిన అనుచరగణం దగ్గరకు పైకి లేపారు. ఈ సంఘటనలో తమ్మినేనికి ఎలాంటి గాయాలు అవ్వలేదు.
Click Here for Videos
In the 47th match of IPL 2026, Mumbai Indians defeated Lucknow Super Giants by six…
Prabhas is currently juggling multiple high-budget pan-India films, and scheduling issues are starting to affect…