Telugu

మహేష్ బాబు అభిమానులను కాపాడాల్సింది అతనే

కొందరి హీరోల మీద కొన్ని సినిమాల ప్రభావం చాలా గట్టిగా ఉంటుంది. ఒక సినిమా విజయం సాధించగానే ఆ ప్రభావం నుండి బయటపడటానికి చాలా కాలం పడుతుంది. అటువంటి సినిమాలనే తీసి చేతులు కాల్చుకుంటూ ఉంటారు. సరిగ్గా అదే సమస్యతో బాధపడుతున్నాడు మహేష్ బాబు. చాలా కాలం తరువాత శ్రీమంతుడు హిట్ కావడంతో ఆ రకం సినిమాలకే అతుక్కు పోయారు. ఆ సినిమాలో చేసినట్టే సున్నితమైన నటన కొనసాగిస్తున్నారు.

భరత్ అనే నేను అటువంటి సినిమానే అయినప్పటికీ రాజకీయం యాంగిల్ తోడు కావడంతో కొంతమేర పర్లేదు అనిపించాడు. అయితే మహర్షితో మాత్రం ఇది టూ మచ్ అయిపోయింది. ఏదో అక్కడక్కడా ఒకటి రెండు స్కీన్లు తప్ప అదే షర్టు నలగని సున్నితమైన యాక్షన్. ఇది ఎంతవరకూ వెళ్ళింది అంటే ఫ్యాన్స్ కూడా జీర్నించుకోలేకపోతున్నారు. శ్రీమంతుడు హ్యాంగ్ ఓవర్ నుండి ఎంత త్వరగా బయటపడితే అంత మంచిదని దేవుడిని కోరుకుంటున్నారు. అయితే వారికి ఇప్పుడు అనిల్ రావిపూడి చిరుదివ్వెలా కనిపిస్తున్నారు.

ADVERTISEMENT

అనిల్ రావిపూడి మహేష్ బాబు తరువాతి సినిమాను డైరెక్టు చెయ్యబోతున్నారు. అనిల్ సినిమాలలో వెరైటీ లేకపోయినా ఆయన హీరోలు సున్నితమైన యాక్షన్ చెయ్యరు. ఎనర్జీతో గంతులు వేస్తారు. అనిల్ మహేష్ బాబు ను ఈ నీరసపు యాక్షన్ నుండి బయటకు తీసుకుని వస్తాడని వారు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. అటువంటి సినిమా ఒక్కటి తీసి సంక్రాంతికి దింపేస్తే మొత్తం సెట్ అవుతుందని వారు ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే సంక్రాంతి సినిమా పూర్తి కావాలంటే బాబు సహకారం కూడా ఉండాలి.

Share
Sridhar Raavi

Sridhar is a highly experienced hand in Telugu politics, writing and analyzing political happenings in Andhra Pradesh and Telangana. An IT engineer turned news junkie, Sridhar has a sharp eye for catching news as it u…

Published by

Recent Posts

DC vs PBKS: Choke Again? Sarpanch Cap Clueless!

Delhi Capitals kept their IPL 2026 playoff hopes alive with a thrilling 3 wicket victory…

2 hours ago

The “Weekend CM” Drama: YSRCP’s Identity Crisis?

The YSRCP’s current obsession with where the CM and Deputy CM spend their weekends is…

3 hours ago