
[m9ad]
అయితే అంతకుముందు సినిమాకు ఖర్చు పెట్టిన 50 లక్షల రూపాయలను హీరో సతీష్ జాయ్ నిర్మాత గౌరీకృష్ణప్రసాద్ ఇచ్చేందుకు అంగీకరించగా, ఇపుడు సదరు మొత్తం చెల్లించకుండానే సినిమాను రిలీజ్ చేసుకున్నారంటూ హైదరాబాద్, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదు చేసారు. నిజానికి ఈ సినిమా విడుదల ఆపేయాలని రంగారెడ్డి జిల్లా కోర్టు తీర్పు ఇచ్చిందని, ఆ నిబంధనలను కూడా విభేదిస్తూ హీరో సతీష్ సినిమాను విడుదల చేసినట్లుగా నిర్మాత ఆరోపించారు.
తనకు రావాల్సిన 50 లక్షల రూపాయల గురించి అడుగుతుంటే, తనకు కేసులు, కోర్టులు కొత్త కాదు, ఏం చేయాలో, ఎలా చేసుకోవాలో తనకు తెలుసని, తనకు రాజకీయ నాయకులు తెలుసంటూ హీరో సతీష్ బెదిరిస్తున్నట్లుగా నిర్మాత గౌరీ కృష్ణప్రసాద్ మీడియాకు వివరించారు. మరి ఇందులో హీరో గారి వర్షన్ ఎలా ఉంటుందో చూడాలి. అయితే సినిమాకు లభించిన టాక్ రీత్యా ఇదేమి పబ్లిసిటీ స్టంట్ కాదు కదా? అన్నది కూడా లేకపోలేదు.
Director Boyapati Srinu has caught attention with his latest political remarks, hinting at his voting…
ఏపీ పాఠశాల విద్యాశాఖ గురువారం డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈసారి మొత్తం 2,721 పోస్టులు భర్తీ చేయబోతోంది. వీటిలో…